అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరిగాయి. జిల్లాలో 49,555 మంది పరీక్ష రాశారు. వారితో పాటు తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.