డెంగీ జాడలు
Published Thu, Jul 28 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
అనంతపురం సిటీ :
డెంగీ జ్వరం బారిన పడిన తాడిపత్రి ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలుడు అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. బుధవారం బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇంకా ఈ జ్వరం బారిన పడిన పిల్లలుంటే ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఎవరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి లేని పోని వైద్య పరీక్షల పేరుతో డబ్బు దోపిడికి గురి కావద్దని వైద్యులు చెప్పారు.
Advertisement
Advertisement