రోళ్లపాడులో ట్రైనీ ఎఫ్‌బీఓలు
మిడుతూరు: రోళ్లపాడు అభయారణ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఫారెస్టు అకాడమీకి చెందిన ట్రైనీ ఎఫ్‌బీఓలు సోమవారం సందర్శించారు. అభయారణ్య పరిధిలో సంచరిస్తున్న కృష్ణజింకలు, వివిధ రకాల పక్షులను బైనాక్యూలర్ సహాయంతో వీక్షించారు. పర్యావరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన బట్టమేక పక్షి నమూనా, పక్షుల కిలకిల రావాలు(శబ్దాలు), వివిధ రకాల పక్షులకు సంబంధించిన నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కోర్సు డైరెక్టర్ స్వరూపారాణి, ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్ కొండల్‌రావు, డీఆర్వో రంగన్న తదితరులు పాల్గొన్నారు.