అంగన్‌వాడీ చిన్నారులకు తీరని శాపం
అంగన్‌వాడీ చిన్నారులకు తీరని శాపం
Published Mon, Sep 26 2016 8:30 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
–14వ ఆర్ధిక సంఘం నిధులున్నా – మౌలిక వసతులు కల్పన సున్నా
–3,889 అంగన్‌వాడీ కేంద్రాల్లో కానరాని నీరు, ఫ్యాను, లైట్లు
దెందులూరు: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యపర్యవేక్షణ దోరణే కారణంగా జిల్లాలో ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు మౌలిక వసతుల కల్పనకు నోచుకోలేకపోతున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందాన కేంద్రంలో ఉన్నచిన్నారుల సౌకర్యాల పరిస్థితి తయారయ్యింది. అన్ని వ్యాధులకు మూలం తాగునీరు. సురక్షిమైన తాగునీరు కాకుండా వేరే నీరు తాగడం వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.
చిన్నారుల్లో వ్యాధి నిరోదక శకి తక్కువుగా ఉంటుంది. అడగలేని అంగన్‌వాడీ చిన్నారులకు సురక్షితమైన త్రాగునీరు, గాలి,విద్యుత్ లైట్లు సౌకర్యం కరువైంది. ఉన్నత పాఠశాలల్లో ఆర్‌ఓ సిస్టం ద్వారా త్రాగునీరు కల్పిస్తూ చిన్నారులకు మాత్రం రక్షణ లేని తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. జిల్లా కలెక్టర్ ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో సురక్షితమైన తాగునీరు, ఫ్యాను, లైటు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ఇందుకు ఆయా గ్రామ పంచాయతీలు 14వ ఆర్ధిక సంఘం నిధులు మంజూరుచేయాలని లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. నెలలు కావస్తున్నా అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు సమయంలో ఎలా ఉన్నాయో నేటికీ అలాగే ఉన్నాయి.
గ్రామ పంచాయతీలు జిల్లా కలెక్టరు ఆదేశాలను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో జిల్లాలో 48 మండలాల్లో 3889 అంగన్‌వాడీ కేంద్రాల్లోదాదాపు లక్ష మంది చిన్నారులకు వేలాది మంది చిన్నారులు సురక్షితమైన తాగునీరు, గాలి సౌకర్యానికి దూరంగా ఉన్నారు. పర్యవేక్షణ చేయవలసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచకపోవడం, జిల్లా కలెక్టరు ఆదేశాలను అమలు చేసి నిధులు మంజూరు చేయాల్సిన గ్రామ కార్యదర్శులు స్పందించకపోవడం వెరసి అంగన్‌వాడీ కేంద్రాలు మౌలిక వసతుల కల్పనకు నోచుకోలేకపోతున్నాయి.
వి చంద్రశేఖర్‌రావు, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టరు, ఐసిడిఎస్
గతంలో జిల్లా కలెక్టరు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చిన సంగతి వాస్తవమే. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్‌ఓ ఫిల్టర్లు,ఫ్యాన్లు లేవు. ఇప్పుడిప్పుడే పంచాయతీ అధికారులు నిధులు మంజూరుకు అంగీకారం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని పంచాయతీలకు వెళ్ళి తమ వంతు బాధ్యతగా మౌలిక వసతుల కల్పన విషయానికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలను అన్ని పంచాయతీలకు సిడిపిఓలు , అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా ఇచ్చాము. వివరిస్తున్నాం. త్వరలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఆర్‌ఓసిస్టం వాటర్‌ఫిల్టర్లు, ఫ్యాన్, విద్యుత్, లైట్ల సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి.
మేరుగు సునీల్, మనకోసం సమాచార హక్కు సంఘం సభ్యులు
కలెక్టర్ ఆదేశాలు అమలు చేయాలి.
చిన్నారుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ గాలి, వెలుతురు, సౌకర్యాల ఏర్పాట్లలో కలెక్టర్ ఆదేశాల అమల చేయడానికి పంచాయతీలకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? నెలల తరబడి 14వ సంఘం ఆర్ధిక నిధులు కేటాయించకపోయినాకలెక్టర్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అంగన్‌వాడీకేంద్రాల్లో చిన్నారుల సౌకర్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.
Advertisement
Advertisement