విజయవాడలో బీజేపీ నేతలు విద్యార్థులపై దాడి చేయడాన్ని వైఎస్ఆర్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఖండించారు.
విజయవాడ: విజయవాడలో బీజేపీ నేతలు విద్యార్థులపై దాడి చేయడాన్ని వైఎస్ఆర్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఖండించారు. ప్రజస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. బీజేపీ కార్యాలయం ఎదుట విద్యార్థులు నిరసన తెలపడం తప్పుకాదని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్కు వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన జేఏసీ నాయకులు విజయవాడలోని బీజేపీ కార్యాయం ఎదుట నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. బీజేపీ నాయకులు అడ్డుకుని వారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.