ఉగాదికి ఉపాధి వేతనాలు విడుదల
ఉగాదికి ఉపాధి వేతనాలు విడుదల
Published Sat, Mar 25 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
- గ్రామీణా«భివృద్ధి కమిషనర్ రామాంజినేయులు
- జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
కర్నూలు(అర్బన్): ఉపాధి కూలీలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బకాయి ఉన్న రూ. 10 కోట్ల వేతనాలను ఉగాది పండుగలోగా విడుదల చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం ఆయన రాజధాని నుంచి జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందకపోవడాన్ని డ్వామా పీడీ డాక్టర్ సి.హెచ్.పుల్లారెడ్డి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వేతన బకాయిలున్నాయని, వీలైనంత త్వరగా వాటిని విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ చెప్పారు.
ఈనెల 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఉపాధి పనులను వేగవంతం చేయాలన్నారు. వర్మికంపోస్టు యూనిట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా పీడీ పుల్లారెడ్డి మాట్లాడుతూ ఈ ఐదు రోజుల్లో ఐదు లక్షల పనిదినాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తామన్నారు. వెయ్యి ప్రకారం ఫాంపాండ్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు, వర్మికంపోస్టు యూనిట్లను పూర్తి చేస్తామన్నారు. ఉపాధి వేతనాలకు సంబంధించి కూలీలు ఎలాంటి హైరానా చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత బకాయిలన్నింటినీ విడుదల చేసిన అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేతనాలను కూలీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని కమిషనర్ చెప్పారు. కార్యక్రమంలో అదనపు పీడీలు మురళీధర్, రసూల్, ఎంఅండ్‌ఈ సులోచన పాల్గొన్నారు.
Advertisement
Advertisement