
మినీ వ్యానులో మంటలు
వేగంగా వెళ్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కంకిపాడు(కృష్ణాజిల్లా): వేగంగా వెళ్తున్న వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. అప్రమత్తమైన డ్రైవర్ తన ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన కష్ణాజిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు వంతెన సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గోషాల నుంచి నిడమనూరు వెళ్తున్న మినీ వ్యాన్ ఉప్పులూరు సమీపంలోకి రాగానే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి.
ఇది గుర్తించిన డ్రైవర్ దుర్గారావు వాహనం బయటకు వచ్చాడు. మంటలు ఆర్పేందుకు యత్నించే లోపే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి వాహనం పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపే వ్యాను కాలి బూడిదైంది.