బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన సుంకన్న(28) అదృశ్యమైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. వెలుగులో బుక్ కీపర్‌గా పని చేసే సుంకన్నకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గూగూడులో జరిగిన పీర్ల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం రాత్రి వెళ్లిన ఆయన, తిరిగి బైక్‌లో స్వగ్రామానికి బయలుదేరాడన్నారు.
బుక్కరాయసముద్రంలోని హెచ్‌ఎల్‌సీ కాలువ వద్ద బైక్ ఉండగా, సుంకన్న సెల్‌ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. అప్పటి నుంచి అతని ఆచూకీ లేకపోవడంతో బంధువులు తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏదైనా హాని తలపెట్టారా?అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
వెలుగు బుక్ కీపర్ అదృశ్యం
Published Thu, Oct 13 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement