నీరు విడుదల చేస్తున్న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
చాగలమర్రి: మండల పరిధిలోని రాజోలి ఆనకట్ట నుంచి కే సీ కాలువకు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి శనివారం నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజోలి ఆనకట్ట నుంచి∙500 క్యూసెక్కుల నీటిని కేసీకి విడుదల చేశామన్నారు. కాలువకు నాలుగు రోజుల ముందే నీటిని విడుదల చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో జాప్యం జరిగిందన్నారు. ఏదిఏమైనా కాలువకు నీటి విడుదలతో రైతులు వరి నాట్లు వేసుకోవచ్చని, చివరి ఆయకట్టుకు నీరు అందేలా తన వంతుగా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో కేసీ కాలువ ఈఈ కొండారెడ్ది, డీఈ జిలాన్, ఏఈ మస్తాన్, దువ్వూరు ఎంపీపీ చంద్రావతి, రైతులు శివశంకర్‌రెడ్డి, మునిరెడ్డి, నరసింహారెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.