కృష్ణా పుష్కరాల సమయానికి దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ పూర్తి చేయలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
విజయవాడ: కృష్ణా పుష్కరాల సమయానికి దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ పూర్తి చేయలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫ్లైఓవర్‌కు ప్రత్యామ్నయంగా రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గురువారం విజయవాడలో దుర్గమ్మ ఆలయం వద్ద సీఎం చంద్రబాబు పుష్కరఘాట్ల పనులను పరిశీలించారు.
పుష్కర పనులను వేగవంతం చేయాలని అక్కడి కాంట్రాక్టర్లు, అధికారులను ఆయన ఆదేశించారు. కృష్ణా పుష్కరాల సమయానికి పనులు పూర్తికాకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.