krishna pushkaram
-
ఖర్చు తప్ప ఆధ్యాత్మిక భావన ఏదీ?
పుష్కరాల ఏర్పాట్లపై కమలానంద భారతి వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లు గుమ్మరించినా ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను నింపలేకపోయిందని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి కమలానంద భారతి అభిప్రాయపడ్డారు. పుష్కరాల ఏర్పాట్లంటూ విజయవాడ పరిసర ప్రాంతాలలో ఆలయాలను కూల్చడం ప్రభావం చూపుతోందని, మున్ముందు ఇదే ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉంటుందన్నారు. పుష్కరాల సందర్భంగా కమలానంద భారతి, బీజేపీ రాష్ట్ర నాయకుడు సీహెచ్ బుచ్చిరాజు తదితరులతో కలసి మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించినట్టు పీఠం బుధవారం ఇక్కడ ప్రకటన విడుదల చేసింది. గోదావరి పుష్కరాలకు వెళ్లిన భక్తులు పడిన ఇక్కట్లను జ్ఞప్తికి తెచ్చుకుంటూ చాలా మంది ఈసారి ఘాట్లకు రావడానికి వెనుకాడుతున్నారని కమలానంద పేర్కొన్నారు. -
కృష్ణా తీరం.. భక్తజన సాగరం
• నాలుగో రోజు 13.5 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు • కిటకిటలాడిన పుష్కర ఘాట్లు • మహబూబ్‌నగర్‌లో 9.5 లక్షలు.. నల్లగొండలో 4 లక్షలపైనే.. • ఒక్క నాగార్జునసాగర్‌లోనే 2 లక్షల మంది.. • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి సాక్షి, మహబూబ్‌నగర్/నల్లగొండ : కృష్ణా పుష్కరాల్లో వరుసగా నాలుగోరోజు భక్తజన ప్రవాహం కొనసాగింది. సోమవారం కూడా సెలవు రోజు కావడంతో శని, ఆదివారాల మాదిరే లక్షల్లో జనం తరలివచ్చారు. పోటెత్తిన భక్తులతో పుష్కర ఘాట్లు కిటకిటలాడాయి. మొత్తమ్మీద సోమవారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని పుష్కర ఘాట్లలో 13.5 లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే 9.5 లక్షలకుపైగా స్నానాలు చేశారు. అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గొందిమళ్ల పుష్కరఘాట్‌లో దాదాపు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానమాచరించారు. సోమశిల, రంగాపూర్, బీచుపల్లి, పస్పుల, నది అగ్రహారం, కృష్ణా పుష్కర ఘాట్లు కూడా కిక్కిరిసిపోయాయి. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, పలువురు శాసనసభ్యులు బీచుపల్లి, రంగాపూర్, సోమశిల పుష్కర ఘాట్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సోమశిలలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీసమేతంగా స్నానమాచరించారు. అలాగే తంగిడి పుష్కరఘాట్‌లో సినీనటుడు కోట శంకర్రావు పుణ్యస్నానం చేశారు. నల్లగొండలో నాలుగు లక్షలపైనే.. నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క నాగార్జునసాగర్‌లోనే అత్యధికంగా రెండు లక్షల మంది స్నానాలు చేశారు. సాగర్ జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో శివాలయం ఘాట్‌లో దాదాపు లక్షన్నర మంది భక్తులు, పక్కనే ఉన్న సురికి ఆంజనేయస్వామి ఘాట్‌లో 50 వేల మందికి పైగా భక్తులు స్నానమాచరించారు. వాడపల్లిలో కూడా స్వయంభు శివాలయం ఉండడంతో అక్కడ కూడా స్నానాలు చేసిన వారి సంఖ్య లక్ష దాటింది. మట్టపల్లికి కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే కనిపించింది. ఇక్కడ దాదాపు 50 వేల మంది స్నానం చేసి ఉంటారని అంచనా. జిల్లాలోని మిగిలిన ఘాట్లలో పరిస్థితి యథావిధిగా ఉంది. కనగల్, మట్టపల్లి మార్కండేయ ఘాట్లకు నీళ్లు రాకపోవడంతో భక్తులెవరూ స్నానాలు చేయలేదు. సాగర్ బ్యాక్‌వాటర్ కింద ఏర్పాటు చేసిన మూడు ఘాట్లలో కలిపి స్నానాలు చేసినవారి సంఖ్య 5 వేలకు మించలేదు. మేళ్లచెరువు మండలంలోని ఘాట్లకు కూడా పెద్దగా భక్తుల తాకిడి కనిపించలేదు. వరుస సెలవులు పూర్తవడంతో భక్తులు స్వస్థలాల బాట పట్టడంతో నల్లగొండ జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దారులన్నీ నిండిపోయాయి. భక్తుల సంఖ్య తగ్గుతుండడంతో పోలీసులు కూడా నిబంధనలను కొంతమేర సడలిస్తున్నారు. కిలోమీటర్ల మేర నడిచి ఘాట్లకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా వాహనాలను అనుమతిస్తుండడంతో భక్తులకు కొంత ఉపశమనం కలుగుతోంది. -
భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం
♦ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ♦ పుష్కరఘాట్లను సందర్శించిన ముగ్గురు మంత్రులు పెబ్బేరు/కొల్లాపూర్: కృష్ణాపుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపుర్ఘాట్, కొల్లాపూర్ మండలంలోని సోమశిల ఘాట్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు పుష్కర జలాన్ని తలపై పోసుకుని కృష్ణమ్మకు నమస్కరించారు. భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పుష్కరాలు విజయవంతం చేసేందుకు ఏడు నెలల ముందే సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ప్రాముఖ్యత ఉన్న ఘాట్లను ఎప్పటికప్పుడు సందర్శించి భక్తులతో నేరుగా సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. ఎక్కడా అసౌకర్యాల ప్రస్తావనే లేదన్నారు. -
అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది
-
చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం
-
అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది: చంద్రబాబు
విజయవాడ : శ్రావణ శుక్రవారం కావడం వల్ల కృష్ణా పుష్కరాల తొలి రోజు భక్తుల రద్దీ తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని దుర్గాఘాట్‌లో చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ....రేపటి నుంచి అంటే శనివారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాలు సందర్బంగా పవిత్ర సంకల్పాన్ని చేపట్టామని చెప్పారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా బస్సుల రద్దీని క్రమబద్దీకరిస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో కొన్ని గుళ్లు తొలగించామని కొందరు గగ్గోలు పట్టారు.... అయినప్పటికీ చేయాల్సిన అభివృద్ధి చేయగాలిగామన్నారు. ప్రత్యేక హోదా కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. -
కృష్ణా పుష్కరాలపై సీఎం సమీక్ష
విజయవాడ : కృష్ణా పుష్కరాల విధులకు ఐఏఎస్ అధికారులతోపాటు డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లతోపాటు సిబ్బంది హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం విజయవాడలో కృష్ణ పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అక్షయ ద్వారా టీటీడీ నిర్వహిస్తున్న భోజన ఏర్పాట్లపై నేడే ట్రయల్ రన్ నిర్వహించాలని ఉన్నతాధికారులకు తెలిపారు. -
ఆంధ్రాపై నిప్పులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎర్రచందనం దుంగలను నరికారనే ఆరోపణలతో గత ఏడాది 20 మంది తమిళ కూలీలను తిరుపతి శేషాచలం కొండల్లో ఎన్కౌంటర్ చేసి హతమార్చడం, తమిళనాడు నుంచి తిరుపతికి బస్సులో వెళుతున్న 288 మందిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా న్యాయవాదులను పెట్టి వారిని విడిపించింది. ఇదిలా ఉండగా ఈ నెల 4వ తేదీన గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై నుంచి తిరుపతికి వెళుతున్న 32 మంది తమిళ కూలీలను ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది. గతంలోని దుందుడుకు చర్యలకు కొనసాగింపుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ ఏడాది మరో 32 మంది తమిళ కూలీలపై గురిపెట్టారంటూ పార్టీలకు అతీతంగా దుమ్మెత్తిపోస్తున్నారు. తమిళ కూలీలను విడుదల చే యాలంటూ ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి వేర్వేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉత్తరాలు రాశారు. ఇతర పార్టీల నేతలూ వారితో గొంతుకలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పె రిగింది. కూలీలు అరెస్టయి ఐదు రోజులు గడిచినా సీ ఎం ఉత్తరంపై చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం మిన్నంటింది. మంత్రి గంటా పరుగు చంద్రబాబు ప్రభుత్వంపై ఎంతో ఆగ్రహంతో ఉన్న త మిళ ప్రజలకు ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు దొరకడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. కృష్ణ పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం తరఫున డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఆహ్వానించేందుకు మంత్రి గంటా సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రి రాకను ముందుగానే తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆయన్ను చుట్టుముట్టారు. 32 మంది తమిళ కూలీలను ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై అభిప్రాయాన్ని చెప్పాలని ప్రశ్నించారు. ‘ఏమిటీ.. ఎర్రచందనం స్మగ్లింగ్ కూలీల గురించా అడుగుతున్నారు’ అంటూ ఆయన ఎదురు ప్రశ్న వేశారు. అవునని చెప్పిన మీడియా మంత్రి సమాధానం కోసం ఎదురుచూసింది. అయితే అన్నీ విన్న మంత్రి గంటా ‘అది నా శాఖకు సంబంధించిన వ్యవహారం కాదు, నేనేమీ చెప్పలేను’ అని నింపాదిగా సమాధానం ఇచి వెళ్లిపోయేందుకు కదిలారు. అయితే మంత్రిని చుట్టుముట్టిన ప్రజలు, మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. పాలారు నదిలో చెక్‌డ్యాం ఎత్తు పెంపుతో తమిళ రైతులను బాధిస్తున్నారు కదా అని ప్రశ్నించగా, ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగవద్దు అంటూ మీడియాను వదిలించుకుని పరుగులాంటి నడకతో కారులో కూర్చుని తుర్రున జారుకున్నారు. గోపాలపురంలో కరుణానిధిని కలుసుకుని ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కరుణానిధి సైతం తమిళ కూలీల అరెస్ట్, పాలారు జలాశయంలో చెక్‌డ్యాం ఎత్తు పెంపు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. కరుణను గంటా కలుసుకున్నపుడు డీఎంకే ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా ఉన్నారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తమిళ కూలీల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తూ తమిళర్ మున్నేట్రపడై నేతలు సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలారు జలాశయంలో చెక్‌డ్యాంల ఎత్తు పెంచడం ద్వారా రైతన్నలకు ద్రోహం చేసిన చంద్రబాబు దైవదర్శనానికి వస్తున్న తమిళ కూలీలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాడని దుయ్యబట్టారు. చెన్నై కోయంబేడు బస్‌స్టేషన్ సమీపంలో సుమారు 25 మందికి పైగా నేతలు, కార్యకర్తలు ఆందోళన జరిపారు. ఏపీ బస్సులను ముట్టడిస్తామని ముందుగా ప్రకటించడంతో బస్‌స్టేషన్ చుట్టూరా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను తగులబెట్టారు. కోయంబేడు పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి సాయంత్రం విడిచిపెట్టారు. -
పుష్కరాల్లో హైవేపై ట్రాఫిక్ మళ్లింపు
ఏలూరు (మెట్రో) : కృష్ణా పుష్కరాల సందర్భంగా 12వ తేదీ నుంచి జిల్లా మీదుగా వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు ఏలూరు రేంజ్ డీఐజీ పి.వి.రామకృష్ణ తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దారి మళ్లింపు ఇలా ∙చెన్నై వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలను కత్తిపూడి – అమలాపురం– చించినాడ– పాలకొల్లు– భీమవరం– కైకలూరు– గుడివాడ– చల్లపల్లి మీదుగా ఒంగోలు పంపిస్తారు. అలాగే రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలను రాజమండ్రి– సిద్ధాంతం బ్రిడ్జి – తాడేపల్లిగూడెం– ఆకివీడు – గుడివాడ– చల్లపల్లి– రేపల్లె– ఒంగోలు మీదుగా చెన్నై పంపిస్తారు అలాగే నారాయణపురం– గణపవరం– ఉండి– ఆకివీడు – కైకలూరు– గుడివాడ – చల్లపల్లి– రేపల్లె మీదుగా ఒంగోలు పంపిస్తారు. అలాగే రాజమండ్రి– సిద్ధాంతం బ్రిడ్జి – హనుమాన్ జంక్షన్– గుడివాడ– చల్లపల్లి– మోపిదేవి– రేపల్లె– ఒంగోలు మీదుగా కూడా చెన్నై తరలిస్తారు. అలాగే దేవరపల్లి – గుండుగొలను – నారాయణపురం– గణపవరం– ఉండి– ఆకివీడు– కైకలూరు– గుడివాడ–చల్లపల్లి– మోపిదేవి– రేపల్లె– ఒంగోలు మీదుగా కూడా చెన్నై తరలిస్తారు. ∙కోల్‌కతావైపు వెళ్లాల్సిన వాహనాలను ఒంగోలు – రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– మచిలీపట్నం– పెడన– కృత్తివెన్ను – లోసరి– నర్సాపురం – చించినాడ– రాజోలు– అమలాపురం– కాకినాడ – కత్తిపూడి మీదుగా పంపిస్తారు. అలాగే ఒంగోలు – రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– గుడివాడ– హనుమాన్‌జంక్షన్– సిద్ధాంతం బ్రిడ్జి– రాజమండ్రి మీదుగా కూడా విశాఖపట్నం తరలిస్తారు. అలాగే ఒంగోలు– రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– గుడివాడ– కైకలూరు– ఏలూరు– సిద్ధాంతంబ్రిడ్జి– రాజమండ్రి మీదుగా విశాఖపట్నం తరలిస్తారు. -
కూచిపూడి కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (మెట్రో) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఈ నెల 23న వెయ్యిమంది యువ కళాకారులతో కూచిపూడి మహాబృంద నాట్యం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు సెట్వెల్ సీఈవో కె.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ బృందంలో నాట్యం చేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఇతర వివరాలకు మురళీమోహన్ 8008889845 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
పుష్కరాలు... ఆరోగ్య జాగ్రత్తలు
ఎక్కువ సంఖ్యలో గుమిగూడటం (క్రౌడింగ్) పుష్కర సమయంలో కొద్దిపాటి స్థలంలోనే జనం గుంపులుగా చేరతారు. దాంతో తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉంది. ఇలా జరిగితే కిందపడినవాళ్లు గాయపడే అవకాశమూ ఉంది. జనసమ్మర్దం కిక్కిరిసిన చోట భారీ స్థాయిలో తొక్కిసలాటలు జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలా జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు కలుషితం కావడం ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడే చోట్లలో నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ఇది జరిగితే ఆ కలుషితమైన నీళ్లను తాగిన వారికి నీళ్ల విరేచనాలు, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తాగే నీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం కలుషితం కావడం పెద్ద సంఖ్యలో జనం చేరిన చోట అందరికీ ఆహారం సమకూర్చడం కష్టమవుతుంది. అయితే ఆహారాన్ని అందించే హోటళ్ల వంటి చోట్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా ఉంటుంది కాబట్టి శుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు హోటళ్లు, క్యాంటిన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పారిశుద్ధ్యం ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు పారిశుద్ధ్యం (శానిటేషన్) వసతులు కష్టం. అలాంటి పరిస్థితుల్లో పుష్కరాలకు వచ్చే జనం ఆరుబయట మలమూత్ర విసర్జనల వంటి చర్యలకు పాల్పడితే పరిసరాలు మరింత దుర్గంధమయంగా మారి కలుషితమవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు తగిన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. దోమల నుంచి రక్షణ ఎక్కువ సంఖ్యలో ప్రజలు చేరే చోట్లలో నీరు మురికిగా మారి దోమల పెరుగుదలకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల తగిన పారిశుద్ధ్య చర్యలు చేపడితే దోమలను, వాటి వల్ల ప్రబలే చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత ఇంట్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి అవకాశం ఎక్కువ. కానీ చాలా పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడినప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఒకింత కష్టమే. అయినప్పటికీ వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. డయాబెటిక్ రోగులు జనాలు కిక్కిరిసి ఉండే పరిస్థితుల్లో అంటు వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. పైగా డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవారిలో రోగినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్లకు వచ్చే వారిలో వృద్ధులు, పిల్లలు, డయాబెటిస్ రోగులు జాగ్రత్తగా ఉండాలి. టీకాలు ఇలాంటి చోట్ల ప్రబలే వ్యాధులను గుర్తించి ముందుగానే అవసరమైన టీకాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేయవచ్చు. గుండెజబ్బులు ఉన్నవారు గుండెజబ్బులు ఉన్నవారు పుష్కరాలకు వెళ్లదలిస్తే, ముందుగా డాక్టర్లను సంప్రదించి, వారు సూచించిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రద్దీలో ఊపిరాడక గుండెజబ్బులు ఉన్నవారు స్పృహ తప్పినప్పుడు కార్డియో పల్మునరీ రీససియేషన్ (సీపీఆర్) అనే ప్రక్రియను చేపట్టాలి. గర్భిణులకు / మహిళలకు ఇలాంటి ప్రదేశాల్లో గర్భిణులు గుంపులో చిక్కుబడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకు తగినన్ని సబ్బులను అందరికీ అందుబాటులో ఉంచాలి. చల్లారిన ఆహారం తీసుకోవద్దు చల్లగా ఉండే పాలు తాగకూడదు. వేడిగా ఉన్న పాలనే తాగాలి. అలాగే చల్లారిపోయిన, నిల్వ ఉన్న ఆహారాన్ని పరిహరించాలి. అందుబాటులో అంబులెన్స్‌లు గాయపడ్డవారిని, స్పృహతప్పిన వారిని సత్వరమే ఆసుపత్రికి చేర్చడం కోసం అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలి. వారిని ఇలా పట్టుకోవాలి స్పృహతప్పిన వారిని ఆసుపత్రికి చేరవేసేందుకు ఎత్తినప్పుడు, మిగతా శరీర భాగాలకంటే తల కాస్త కిందికి ఉండేలా ఎత్తుకొని తీసుకురావాలి. దీనివల్ల రక్తపోటు పడిపోయిన వారికి, భూమ్యాకర్షణ వల్ల మెదడుకు తగినంత రక్తసరఫరా జరుగుతుంది. ఫలితంగా వారు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. అంబూబ్యాగ్‌లు అవసరం ఊపిరి అందక స్పృహ తప్పినప్పుడు వారికి తక్షణం ఊపిరి అందేలా చేయడానికి ‘అంబూ బ్యాగ్’ అనే ఉపకరణంతో శ్వాస అందించేందుకు ప్రయత్నం చేస్తారు. జనం పెద్ద ఎత్తున చేరే చోట్లలో తగినన్ని అంబూబ్యాగ్స్ను ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. జన్మస్థానమైన మహాబలేశ్వరం వద్ద కృష్ణానదిని ‘కృష్టాబాయి’ అని పిలుస్తారు. కృష్ణా నది పుట్టుక, మహిమల గురించిన ప్రస్తావన భాగవత, మార్కండేయ, వామన, నారద, వరాహ, బ్రహ్మాండపురాణాలతో పాటు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. -
నాసిరకంగా పుష్కరాల పనులు :వీహెచ్
హైదరాబాద్ : రాష్ట్రంలో కృష్ణా పుష్కరాల పనులు నాసిరకంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీహెచ్ ఆరోపించారు. దీనిపై గవర్నర్ స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. గుళ్లు గోపురాలు తిరగడానికి తప్ప ఆయనకు వేరే పనిలేదని ఎద్దేవా చేశారు. భవానీ ఘాట్ వద్ద నిర్మించిన బ్రిడ్జి నాసిరకంగా ఉందని... పిల్లర్ పడిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగుతోన్న పుష్కర పనులపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పుష్కర పనులు కాంట్రాక్ట్ తీసుకున్న సోమా కంపెనీ ఎవరిదో బయటకు రావాలని వీహెచ్ అన్నారు.గవర్నర్‌కు ఇచ్చే వినతి పత్రాలన్నీ చెత్త బుట్టలోకి చేరుతున్నాయని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గవర్నర్ ఉన్నంత వరకు న్యాయం జరగదన్నారు. ఛలో మల్లన్న సాగర్‌కు తనను పిలవలేదని కాంగ్రెస్ నాయకులపై వీహెచ్ మండిపడ్డారు. నేను మల్లన్నసాగర్‌కు వెళ్తే.. ఎవరిని అడిగి వచ్చారని సునీతాలక్ష్మారెడ్డి అనడం దారుణమని వీహెచ్ వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులను ఆమె బెదిరించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన నాయకులే నన్ను వద్దని అన్నప్పుడు నేను ఎందుకు వెళ్లాలని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'పుష్కరాల సమయానికి ఫ్లైఓవర్ పూర్తి చేయలేం'
విజయవాడ: కృష్ణా పుష్కరాల సమయానికి దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ పూర్తి చేయలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫ్లైఓవర్‌కు ప్రత్యామ్నయంగా రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గురువారం విజయవాడలో దుర్గమ్మ ఆలయం వద్ద సీఎం చంద్రబాబు పుష్కరఘాట్ల పనులను పరిశీలించారు. పుష్కర పనులను వేగవంతం చేయాలని అక్కడి కాంట్రాక్టర్లు, అధికారులను ఆయన ఆదేశించారు. కృష్ణా పుష్కరాల సమయానికి పనులు పూర్తికాకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. -
నత్తకు నడకలు
► ముందుకు సాగని పుష్కర పనులు ► అధికారుల అలసత్వానికి తోడు వర్షాలు ► జూలై 15 నాటికి పూర్తి కావడం గగనమే ► అన్ని శాఖల అధికారులతో నేడు సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాలకు గడువు ముంచుకొస్తోంది. ఎక్కడికక్కడ అధికారులు, పాలకులు హడావుడి చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పనులు మాత్రం ముందు కు కదలడం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రోడ్ల నిర్మాణ పనులకు మరింత అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పుష్కర ఘాట్లకు వెళ్లే ప్రధాన రహదారుల పనులు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. 83 పనులకు రూ.170 కోట్లతో మే పదో తేదీ నాటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అప్పటి నుంచి పనులు ప్రారంభించినప్పటికీ ఇంత వరకు పది శాతం పనులు కూడా పూర్తి కాలేదు. జూలై 15 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం పనులు సాగుతున్న తీరు చూస్తుంటే పుష్కరాల నాటికి పూర్తవడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా గుంటూరు- అమరావతి, సత్తెనపల్లె-మాదిపాడు రోడ్లలను వెడల్పు చేస్తున్నారు. క్రోసూరు-అమరావతి, సత్తెనపల్లె-అమరావతి, తుళ్లూరు-అమరావతి, దుగ్గిరాల-కొల్లిపర, తెనాలి-వెల్లటూరు రోడ్లలను పటిష్ట పరుస్తున్నారు. అప్రోచ్ రోడ్లదీ అదే తీరు గురజాల నుంచి రేపల్లె వరకు ఘాట్లకు వెళ్లే అప్రోచ్ రోడ్లను పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షిస్తోంది. 58 పనులకు రూ.42 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనులు కేవలం 20 శాతం మాత్రమే పూర్తయ్యాయి. పుష్కర ఘాట్ల పనులను నీటి పారుదల శాఖ చేపట్టింది. 80 ఘాట్లను రూ.109 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ పనులూ నత్తనడకన సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ కింద భాగంలోని మూడు ప్రధాన ఘాట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నేడు సమీక్ష... రెండు జిల్లాలో పుష్కర పనులపై అన్ని శాఖల అధికాారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో సమీక్షించనున్నారు. నోట్: ప్రారంభంకాని సత్తెనపల్లె-మాదినపాడు రోడ్డు పనులు ఫోటోను సత్తెనపల్లె రిపోర్టర్ శ్రీనివాస్ పంపుతారు. -
చిరకాలం గుర్తుండేలా కృష్ణాపుష్కరాలు
మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ : గోదావరి పుష్కరాలను మరిపించేలా కృష్ణాపుష్కరాలను నిర్వహించి చరిత్రలో గుర్తుండిపోయేలా చేస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు వెల్లడించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కృష్ణానదీ తీరం వెంట నూతనంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్ల పనులను వారు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్‌లోని కేఎల్ఐ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. రెండునెలల క్రితం ముఖ్యమంత్రి కే సీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గతంలో గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను చూసి ఏపీ ప్రజలు కూడా ఇక్కడికే వచ్చి పుణ్యస్నానాలు చేశారని గుర్తుచేశారు. కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడానికి 86 ఘాట్ల నిర్మాణానికి *212 కోట్లు, ఇతర ఏర్పాట్లకు *825 కోట్లు, కృష్ణాతీరంలోని దేవాలయాల ఆలంకరణ కోసం *4.50కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 15 తేదీలోగా ఘాట్ల పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామని, పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు. కొల్లాపూర్‌కు కళ తెస్తాం : జూపల్లి నల్లమల అంచున ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గానికి పర్యాటకంగా, ఆహ్లాదభరితంగా, ఆలయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటికే దేవాదాయ శాఖ, ఇతర శాఖల అధికారులకు సూచించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కనీవిని ఎరుగని రీతిలో కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుపై పక్కరాష్ట్రం నాయకులు చేస్తున్న విమర్శలకు ఇక్కడి నాయకులు వంత పాడడం సరికాదని, ఉద్యమ స్ఫూర్తితో సీఎం.కేసీఆర్ అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వచ్చే 3 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో జరగనంత అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీపీలు నిరంజన్‌రావు, వెంకటేశ్వర్రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చెర్మైన్ జూపల్లి రఘుపతిరావ్, నాయకులు జూపల్లి రామారావు, సిబ్బది నర్సింహారావు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పుష్కరాల ఏర్పాట్లు
► రూ. 150కోట్ల నిధులు మంజూరు ► ఆగస్టు 8లోగా పనులు పూర్తి ► అధికారుల సమీక్షలో కలెక్టర్ వెల్లడి. శ్రీశైలం : ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణానది పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చెప్పారు. శ్రీశైలంలో పుష్కర ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ అనురాధ, ఆర్డీఓ రఘుబాబు, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో కలిసి బుధవారం కలెక్టర్ క్షేత్రపర్యటన చేశారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 8లోగా పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. శ్రీశైలం పాతాళగంగ, లింగాలగట్టుతో పాటు సంగమేశ్వరం వద్ద పుష్కరఘాట్లను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన 36 పనులకు రూ.60 కోట్ల వ్యయం అంచనాలను రూపొందించి టెండర్లను పిలిచామన్నారు. అలాగే రోడ్లు భవనాలశాఖ ద్వారా 11 పనులకు రూ. 29 కోట్లు, దేవాదాయశాఖ ద్వారా 23 పనులకు రూ. 9 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఇవేకాకుండా ఆత్మకూరు, నందికొట్కూరుకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మొదటి దశలొ శాశ్వత ప్రతిపాదికన జరిగే పనులు, రెండవదశలో డ్రెసింగ్ రూమ్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్ నిర్మాణ పనులు, మూడవ దశలో పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, అత్యాధునిక సెక్యూరిటీ సిస్టం, విధుల కేటాయింపు తదితర పనులు జరుగుతాయన్నారు. పనులన్నీ పూర్తి చేసి ఆగస్టు 8న ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. -
ప్రతిష్టాత్మకంగా కృష్ణ పుష్కరాలు
► రూ.180 కోట్లతో 587 ఆలయూల్లో ఏర్పాట్లు ► తిరుపతిలో అంతర్జాతీయు హిందూ సమ్మేళనం ► విలేకర్ల సవూవేశంలో దేవాదాయు శాఖ మంత్రి మాణిక్యాలరావు శ్రీకాళహస్తి : ఈ యేడాది ఆగస్టులో జరగనున్న కృష్ణ పుష్కరాలను ప్రభుత్వం తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయు శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయున విలేకర్లతో వూట్లాడారు. రూ.180 కోట్ల బడ్జెట్‌తో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోని 587 ఆలయూల్లో కృష్ణా పుష్కరాలను శోభాయువూనంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయున వెల్లడించారు. అలాగే టీటీడీ సారథ్యంలో త్వరలో తిరుపతిలో అంతర్జాతీయు హిందూసమ్మేళనం నిర్వహించనున్నట్లు వివరించారు. తద్వారా రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయూలను ఇనువుడింజేసే రీతిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని దశ దిశలా వ్యాంపించే విధంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తావున్నారు. విదేశా ల్లో ఉన్న వైష్ణవాలయూల్లో జరిగే ఉత్సవాలకు టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు, శైవాలయూలకు శ్రీకాళహస్తి, శ్రీశైలం దేవస్థానాలనుంచి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు, అవ్మువారి ఆలయూలకు విజయువాడ కనకదుర్గవ్ము ఆలయుం నుంచి తీర్థ ప్రసాదాలను అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయున వివరించారు. ఇక కృష్ణా పుష్కరాలలో గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న అపశృతులను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన చర్యలు వుుందస్తుగానే చేపడుతున్నట్లు ఆయున పేర్కొన్నారు. ఈ కార్యక్రవుంలో శ్రీకాళహస్తి దేవస్థానం వూజీ చైర్మన్, బీజేపీ నేత కోలా ఆనంద్, నాయుకులు అరవింద్‌రెడ్డి, పగడాల రాజు, సుబ్రవుణ్యంరెడ్డి, రవీంద్రబాబు, గరికపాటి రమేశ్‌బాబు పాల్గొన్నారు. -
కృష్ణ..కృష్ణా..!
► డబ్బుల్లేవ్..అంచనాలు తగ్గించండి ► పుష్కర పనులపై అధికారుల అంతర్గత ఆదేశాలు ► ఆహ్వానించిన టెండర్ల రద్దుకు చర్యలు ► స్నానఘాట్లలో భక్తులకు తప్పని ఇక్కట్లు చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ ఓ వైపు ప్రకటనలు చేస్తుంటే, మరో వైపు ఉన్నతాధికారులు పుష్కర పనుల అంచనాలనుతగ్గిస్తున్నారు. చిన్నపాటి మరమ్మతులతో పాత ఘాట్లను పూర్తి చేసి, అత్యవసర పనులనుచేయాలంటున్నారు. ఇప్పటి వరకు చేసిన అంచనాల మొత్తాలను 80 శాతం తగ్గించాలని, ఆహ్వానించిన టెండర్లను రద్దు చేయాలని అంతర్గత ఆదేశాలు ఇస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : గోదావరి పుష్కరాల కంటే వైభవంగా కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు రూ.1500 కోట్ల వరకు నిధులు కేటాయిస్తామన్నారు. దీంతో వివిధ శాఖల ఇంజినీర్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పాత స్నానఘాట్లను పరిశీలించారు. అవసరమనుకున్న ప్రాంతంలో కొత్త ఘాట్ల నిర్మాణాలకు అంచనాలు తయారు చేశారు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పడేసి పాత ఘాట్లకు తాత్కాలిక మరమ్మతులు చేయడానికి అంచనాలు తయారు చేయాలని, ఘాట్ల వద్ద భక్తులు పడిపోకుండా గ్రిప్ టైల్స్ ఏర్పాటుకు అంచనాలు తయారు చేస్తే, అవేమీ అక్కర్లేదు పాడైపోయిన ఘాట్లకు సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయాలని, గ్రిప్ టైల్స్ వేయకుండా ఘాట్లకు రెడాక్సైడ్ రంగు వేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. కృష్ణా నదిలో నీటిమట్టం గరిష్టంగా పడిపోయిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన భక్తులు స్నానమాచరించడానికి నదిలో ఒక పాయను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను నిలిపివేసి, జల్లు స్నానంకు అంచనాలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నెల 12న విజయవాడ నీటిపారుదల సర్కిల్ కార్యాలయం, విజయవాడ కేసీ డివిజన్ ఇంజినీర్లు ప్రకాశం బ్యారేజి దిగువనున్న 33 పుష్కర ఘాట్ల మర్మమతులకు టెండర్లు ఆహ్వానించారు. సుమారు రూ.20 కోట్ల విలువైన పనులకు సంబంధించిన సమాచారాన్ని ఈ ప్రొక్యూర్మెంట్ మార్కెట్ ప్లేస్‌లో ఏర్పాటు చేశామని వివిధ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ మేరకు ఒక్క విజయవాడ పరిధిలోనే పుష్కర ఘాట్లకు రూ.20 కోట్లకుపైగా నిధులు కేటాయింపు జరిగినట్టు ఆ నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలుసుకున్న కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత కృష్ణాజిల్లా కలెక్టర్ ఆ అంచనాల మొత్తాలను 80 శాతం తగ్గించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఆ శాఖ ఇంజినీర్లు బిత్తరపోవడమే కాకుండా పుష్కర ఘాట్లకు గ్రిప్టైల్స్ వేయకుండా మరమ్మతులు చేస్తే భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు. అదే అభిప్రాయాన్ని వెల్లడించినా, టైల్స్ అవసరం లేదు. రెడ్ ఆక్సైడ్ వేయండంటూ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇలా అంచనాల మొత్తాలను పూర్తిగా తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో సాగునీటిశాఖ అధికారులు పనులు ఎలా పూర్తి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. గుంటూరు జిల్లాలోనూ ఇంతే... గుంటూరు జిల్లాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వివిధ శాఖల అధికారులు చేసిన అంచనాలకు భిన్నంగా అరకొరగా నిధులు మంజూరు చేయడంతో ముఖ్యమైన పనుల జాబితాలను తయారు చేసే పనిలో అధికారులున్నారు. పుష్కర ఘాట్లకు రూ.150 కోట్లతో అంచనాలు తయారు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.65 కోట్లను మంజూరు చేసింది. సీతానగరం ఘాట్‌లో 3 పనులకు రూ.20 కోట్లతో అంచనాలు తయారు చేస్తే రూ.15 కోట్లకు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని మొత్తం అన్ని శాఖలు రూ.485 కోట్లతో అంచనాలు తయారు చేస్తే ఇప్పటి వరకు రూ.360 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అంచనాలను భారీ ఎత్తున రూపొందించినప్పటికీ, ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉండడంతో వాటిలో కోత విధిస్తోంది. ఆగస్టులో జరగనున్న ఈ పుష్కరాలకు ఇంకా ప్రతిపాదనలు దశ పూర్తికాకపోవడం, టెండర్లు ఆహ్వానించే దశలోనే అధికారులు ఉండడంతో పనులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
అడిగింది కొండంత.. ఇచ్చింది గోరంత
► కృష్ణా పుష్కరాలకు విదిల్చింది కేవలం రూ.231 కోట్లే ► ఈ నిధులతో కొత్త ఘాట్ల నిర్మాణం అనుమానమే సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న కృష్ణా పుష్కరాలల్లో నీటిపారుదలశాఖ పనులకు ప్రభుత్వం రూ.231 కోట్లు కేటాయించింది. ఈ రూ.231 కోట్లు ఒక్క కృష్ణా జిల్లాకే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇందులో కృష్ణా జిల్లాకు కేవలం రూ.142 కోట్లు (ఇందులో రూ.66 కోట్లు వీఎంసీ ఖాతాకు), గుంటూరు జిల్లాకు రూ.65 కోట్లు, కర్నూలుకు రూ.24 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిగింది కొండంత.. పుష్కరాల కోసం కృష్ణాజిల్లాలోని 118 పుష్కర ఘాట్లను అభివృద్ధి చేసేందుకు రూ.393.60 కోట్లు, అలాగే గుంటూరు జిల్లాలోని 95 ఘాట్ల మరమ్మతులకు రూ.59.56 కోట్లు కావాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. కాగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని మొత్తం 222 ఘాట్ల పునరుద్ధరణకు రూ.468.87 కోట్లు కావాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం అన్ని జిల్లాలకు కలిపి కేవలం రూ.231 కోట్లు విదిల్చింది. ఈ మొత్తంతోనే 222 పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు తప్ప మొత్తం అన్ని ఘాట్లను ఎప్పుడూ ఉపయోగించరు. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో కూడా ముఖ్యమైన కొన్ని ఘాట్లే వినియోగిస్తారు. అందువల్ల చాలా ఘాట్లలో సిమెంట్ ఫ్లోరింగ్, మెట్లు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయాల్సి ఉంది. అలాగే దివిసీమలో కొత్తగా ఘాట్లు ఏర్పాటు చేయాలనిడిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.231 కోట్లతో పనులు అరకొరగానే జరిగే అవకాశం కనపడుతోంది. చైనా టెక్నాలజీ వినియోగం.. హెడ్ వాటర్‌వర్క్ నుంచి ఫెర్రీ వరకు సుమారు 12 కి.మీ పొడవునా చైనా నిపుణుల సహకారంతో కొత్త ఘాట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి విషయం అటుంచితే ముందుగా ప్రకాశం బ్యారేజ్‌నుంచి దిగువన ఉన్న ఘాట్లకు మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. వీటికి సంబంధించి టెండర్లు త్వరలోనే ఖరారు చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. -
అమాత్యా.. ఇదేమి చోద్యం..!
► ఓ వైపు గుంటూరు అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీ పెద్దలు ► మరో వైపు పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కమిషనర్ నాగలక్ష్మికి మంత్రి ప్రత్తిపాటి క్లాసు ► విస్తుపోతున్న నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ► బృందావన్‌గార్డెన్స్‌లో రోడ్డు విస్తరణకు ఆటంకాలు ► ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో తమ్ముళ్ల వీరంగం ► కార్పొరేషన్లో ఖాళీలను పట్టించుకోని వైనం ► కృష్ణా పుష్కరాలకు పైసా విడుదల చేయని ప్రభుత్వం ► ఇష్టారాజ్యంగా జన్మభూమి కమిటీలు సాక్షి, గుంటూరు : రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు ‘ చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్న’ నానుడిని జ్ఞప్తికి తెస్తున్నాయి...గుంటూరు నగరాభివృద్ధిని తెలుగు తమ్ముళ్లు, టీడీపీ ప్రజాప్రతినిధులు అడుగడుగునా అడ్డుకుంటుండగా, ఆయన మాత్రం నగర కమిషనర్, ఐఏఎస్ అధికారి నాగలక్ష్మికి క్లాసు తీసుకోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. నగరంలో రోడ్లు విస్తరణ చేపట్టి అప్పటి కమిషనర్ కృష్ణబాబు ఎంతో పేరు తెచ్చుకున్నారని మీరు సైతం రోడ్లు విస్తరణ పూర్తిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, అలాగే తమవాళ్లు ఎవరైనా అడ్డుకుంటే తనకు చెప్పాలంటూ మూడు రోజుల కిందట నగర కమిషనర్ నాగలక్ష్మికి మంత్రి క్లాస్ తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగుల నుంచి వినవస్తున్నాయి. నగరంలోని బృందావన్గార్డెన్స్ రోడ్డును మాస్టర్‌ప్లాన్ ప్రకారం 80 అడుగులుగా విస్తరించాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్న కొంతమంది అధికార పార్టీ పెద్దలకు సంబంధించిన గృహాలు, స్థలాలు రోడ్డు విస్తరణలో పోతాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు, తమ్ముళ్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా 60 అడుగులు మాత్రమే విస్తరణ చేపట్టాలని కమిషనర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. అదేవిధంగా జేకేసీ కళాశాల రోడ్డు నుంచి తక్కెళ్ళపాడు రోడ్డు విస్తరణలో పార్టీకి చెందిన ప్రముఖ బిల్డరుకు సంబంధించిన స్థలం కోల్పోతున్నారు. దీంతో కేవలం ఒకవైపు మాత్రమే రోడ్డు విస్తరణ చేపట్టాలని ఒత్తిడి తీసుకువస్తూ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తున్నారు. జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం ... అదే సమయంలో నగరాభివృద్ధికి అవసరమైన నిధులను ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన దాఖలాలు లేవు. కేవలం ప్రజల పన్నులతోనే నగరంలో కమిషనర్ అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తుంది. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన రూ. 540 కోట్లుకు సంబంధించి భూగర్భ డ్రైనేజీ పనులు సైతం ఆలస్యం అవుతున్నాయి. అలాగే నగరాభివృద్ధికి సంబంధించి అటు ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. అదేసమయంలో సంక్షేమ పథకాల అమల్లో జన్మభూమి కమిటీల అవినీతికి అంతులేకుండా పోతుంది. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో తమ్ముళ్లు చేతివాటం చూపిస్తున్నారు. కమిషనర్‌కు తమ్ముళ్ల హెచ్చరికలు.. ఇదిలా ఉంటే నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల అంశం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటిని పాటిస్తున్న కమిషనర్‌పై టీడీపీ పెద్దలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా నగరం మొత్తం ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాటిని వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. అయితే తమ్ముళ్లు మాత్రం ఫ్లెక్సీలు తొలగిస్తే ఊరుకొనేది లేదని కమిషనర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవసరమైతే తెనాలి పట్టణానికి వెళుతున్న నీటిని గుంటూరుకు మళ్లించకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీచేయడంతో ఆమె ఆశ్చర్యపోయారు. నగరపాలక సంస్థలో సిబ్బంది కొరత.. ఇక నగర పాలకసంస్థలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది లేరు. అదనపు కమిషనర్ పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉంది. పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాల్లో సైతం పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ప్రభుత్వం భర్తీ చేయకపోయినా మంత్రి పుల్లారావు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అధికారులు లేకపోవడంతో ప్రతి చిన్న పనిని కమిషనర్ స్వయంగా చూడాల్సి రావడంతో అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని నగర పాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్ నిధులతోనే పనులు... కృష్ణా పుష్కరాలకు సంబంధించి నగరంలో రోడ్లవిస్తరణ, నగర సుందరీకరణ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా మంజూరు చేయలేదు. కార్పొరేషన్ నిధులతోనే పనులు చేపట్టేందుకు కమిషనర్ ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. ఇందులో సైతం తమ్ముళ్లు టెండర్లు దక్కించుకొని నాసిరకంగా పనులు చేస్తూ ఇంజినీరింగ్ అధికారులపై పెత్తనం చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా పట్టించుకోని మంత్రి, ప్రజాప్రతినిధులు నగర ప్రజలపై ప్రేమ ఉన్నట్లు, నగరాభివృద్ధికి అధికారులు కృషిచేయడం లేదన్న విధంగా మాట్లాడడంపై కార్పొరేషన్ సిబ్బంది, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పుష్కరాలపై త్రినేత్రం
సీసీ కెమెరాలతో నిఘా ► గుర్తించిన ఘాట్ల వద్ద ఏర్పాటుచేయనున్న పోలీసు అధికారులు ► అడుగడుగునా భారీ బందోబస్తు ► జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా భద్రత, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు ► ప్రణాళిక రూపొందించిన పోలీస్‌శాఖ కృష్ణానదీ అగ్రహారంవద్ద ఉన్న పుష్కర ఘాట్ మహబూబ్‌నగర్ క్రైం కృష్ణా పుష్కరాలపై మూడోనేత్రంతో నిఘా వేయనున్నారు. పూర్తిగా సీసీ కెమెరాలతో పహారా కాయాలని భావిస్తున్న పోలీస్ అధికారులు.. అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో కృష్ణానదీ తీర ప్రాంతాలు అధికంగా ఉన్న నేపథ్యంలో పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఈసారి జిల్లాలో పుష్కర ఘాట్లకు దాదాపు మూడు కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్న అధికారులు.. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 40నుంచి 45వేల మందికి ఒక సీసీ కెమెరాతో పర్యవేక్షణ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 32 ఘాట్లను గుర్తించిన అధికారులు బందోబస్తు పరంగా ఎక్కడా తగ్గకుండా చూస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 32ఘాట్లలో 400సీసీ కెమెరాలు.. జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు మాసంలో జరగనున్న కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు తగినంత పోలీస్ బలగాలతోపాటు గుర్తించిన 32 ఘాట్లలో రూ.2కోట్లతో 400సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీస్ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇందుకు కావాల్సిన కెమెరాలు, పోలీస్ బలగాలు, భారీ గ్రేడ్స్ ఇతర వాటికి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా పోలీస్‌శాఖ నుంచి ప్రతిపాదన వెళ్లింది. 360 డిగ్రీల కోణంలో తిరిగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.70నుంచి 80వేలను ఒక్కో కెమెరాకు ఖర్చు చేసి అత్యంత టెక్నాలజీతో కూడిన నిఘా పెట్టాలని భావిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరిగినా.. సకాలంలో స్పందించడానికి ఈ కెమెరాలను ఉపయోగించుకోనున్నారు. మొత్తం 400 కెమెరాలకు కలిపి రెండు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి.. అక్కడనుంచి ఏ ప్రదేశంలో ఎలాంటి సంఘటన చోటుచేసుకున్నా స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం చేరవేయనున్నారు. జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి.. జిల్లాలో దాదాపు 185 కిలోమీటర్ల పొడవున్న జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రహదారిపై అక్కడక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో భారీ గ్రేడ్స్ ఉంచి ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై కూడా పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా బీచుపల్లి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బందీ రాకుండా పోలీసులు ముందే నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు నెల రోజులముందే నుంచి పరిసర ప్రాంతాలను వారి అధీనంలోకి తీసుకోనున్నారు. ఘాట్ల సమీపంలో క్యూలైన్ల సరికొత్త భారీ గ్రేడ్స్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది. 11వేల మందితో బందోబస్తు.. పుష్కరాల సమయంలో జిల్లాలో బందోబస్తు నిర్వహించడానికి పోలీస్‌శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్థానికంగా ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో ఘాట్లు ఏర్పాటు చేయడంతో బందోబస్తు భారీ స్థాయిలో ఉండాలని పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల పోలీస్ సిబ్బంది ఉండడంతో అదనంగా మరో 8వేల మందిని ఇతర జిల్లాలనుంచి రప్పిస్తున్నారు. దీంట్లో సివిల్ పోలీసులతో పాటు పారా మిలిటరీ, ట్రాఫిక్ ఇతర విభాగాలు వారు ఉండనున్నారు. ముఖ్యంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ స్థలాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
పుష్కరాలకు అమరావతి బ్రాండ్
► రాజధాని ప్రాచుర్యానికి ప్రభుత్వ వ్యూహం ► ద్యానబుద్ధ, అమరలింగేశ్వర ► ఆలయం వద్ద ప్రత్యేక ఘాట్లు ► ఎండిపోయిన కృష్ణానది ► ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల మల్లగుల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుష్కర ఘాట్లన్నీ నీళ్లు లేక వెలవెలపోతున్నాయి. ఇదే పరిస్థితి ఆగస్టు వరకు కొనసాగితే పుణ్యస్నానం కాదు కదా.. కనీసంజల్లు స్నానం కూడా దక్కదేమోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.నీటి లభ్యతపైపెద్దఎత్తునచర్చజరుగుతున్నా పట్టించుకోని సర్కారు.. పుష్కరాలపై రాజధాని అమరావతి ముద్ర వేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అయినా ఘాట్ల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సాక్షి, విజయవాడ బ్యూరో : గోదావరి పుష్కరాలప్పుడు నదుల అనుసంధాన ప్రచారాన్ని ఊదరగొట్టిన తెలుగుదేశం ప్రభుత్వం.. కృష్ణా పుష్కరాల్లో రాజధాని అమరావతి బ్రాండ్‌ను ప్రయోగించాలని వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగానే పాత అమరావతితోపాటు ఏపీ రాజధాని అమరావతికి పుష్కర ఏర్పాట్లలో ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించింది. ఆగస్టు 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలను రాజధాని ప్రాంత బ్రాండ్ ఇమేజ్‌కు ముడిపెట్టేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అమరావతిలోని 125 అడుగుల ధ్యానబుద్ధ సమీపంలో భారీ ఘాట్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు చేరువలోనే పంచారామ క్షేత్రమైన అమరేశ్వరాలయం ఉండడంతో ఆ రెంటినీ కలిపేలా భక్తుల కోసం ఘాట్లను సమకూర్చే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో నీరు లేనందున పుష్కరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ధ్యానబుద్ధ, అమరేశ్వరాలయం వరకు నిర్మించే ఘాట్ వరకు నీరు వచ్చేలా చిన్న పాయ (కాలువ) తవ్వేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఏడాది పొడవునా ప్రత్యేకంగా తవ్వే కాలువలో నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ నదిలోకి నీరు రాకపోతే పుష్కర స్నానం ఎలాగని భక్తులు మధనపడుతున్నారు. ప్రత్యేకంగా కాలువ తవ్వేందుకు అమరేశ్వరస్వామి ఆలయ సమీపంలోని నదిలో ఉన్న కొండలు అవరోధంగా మారనున్నాయి. దీనికితోడు ఆగస్టు నాటికి నీరు విడుదలైతేనే పుష్కర స్నానం దక్కుతుందని, లేకుంటే తుంపర స్నానమే దిక్కని భక్తులు భావిస్తున్నారు. వినియోగం కాని నిధులెందుకో! పాత అమరావతిని హెరిటేజ్ సిటీగా ఎంపిక చేయడంతో కేంద్రం విడుదల చేసే నిధులతో పుష్కరాల నాటికి పలు అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధులతోనే పుష్కరాలకు అమరావతికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు రెస్ట్రూమ్లు, టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులు వంటి సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నారు. ఇందుకు నిబంధనలు అడ్డువస్తాయనడంలో సందేహం లేదు. వాస్తవానికి కేంద్రం ఎంపిక చేసిన హెరిటేజ్ సిటీల్లో అమరావతి ఒక్కటే గ్రామం కావడంతో దీనికి నగరస్థాయి కల్పించాలన్నా సాంకేతిక సమస్య ముడిపడి ఉంది. అమరావతి డెవలెప్మెంట్ అథారిటీ ఏర్పడినప్పటికీ హెరిటేజ్ సిటీ ఆగ్మెంటేషన్ అండ్ డెవలెప్మెంట్ యోజన (హెఆర్ఐడీఏవై) ద్వారా వచ్చే నిధులను పుుష్కర ఏర్పాట్లకు ఖర్చుచేసే అవకాశం లేదు. ఇప్పటికే విడుదలైన రూ.23 కోట్ల నిధులు అనేక సాంకేతిక సమస్యలతో వినియోగంలోకి రాలేదు. దీంతో హెరిటేజ్ నిధులతో పాత అమరావతిలో పనులు చేపట్టాలన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రూ.400 కోట్లతో వెంకన్న ఆలయం మరోవైపు రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండ్రాయునిపాలెంలో పలు నమూనా దేవాలయాల నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు నమూనా దేవాలయాలను చూసేందుకు రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నది సర్కారు యోచన. దీంతోపాటు వెంకటపాలెం-రాయపూడి ప్రాంతాల్లో రూ.400 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించనున్న బాలాజీ టెంపుల్‌కు పుష్కరాల నాటికి శంకుస్థాపన చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే స్థల అన్వేషణ సాగుతోంది. ఇలా పాత అమరావతి ప్రాంతంతోపాటు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంతో పుష్కరాలను ముడిపెట్టి బ్రాండ్ ఇమేజ్‌పై బహుళ ప్రాచుర్యం కల్పించేలా వ్యూహరచన చేయడం కొసమెరుపు. -
తెలుగు తమ్ముళ్ల ‘నామినేషన్’ జపం
► పుష్కర పనులు దక్కించుకునేందుకు అధికారులపై ఒత్తిడి ► టెండ ర్ల ప్రక్రియ వద్దంటూ నిర్మాణ సంస్థలకు మొండిచేయి ► నాణ్యత కల్ల.. అభివృద్ధి డొల్ల అని హెచ్చరిస్తున్న నిపుణులు సాక్షి ప్రతినిధి, గుంటూరు : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో టీడీపీ నేతలు నామినేషన్ మంత్రం పఠిస్తున్నారు. పుష్కర పనులను ఈ విధానంలోనే కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే అందుకు కారణం. ఇప్పటికే వివిధ శాఖలు రూ.500 కోట్లకుపైగా ప్రతిపాదనలు అందజేశాయి.ఈ నిధులతో రేవుల (ఘాట్లు) మరమ్మతులు, దేవాలయాల జీర్ణోద్ధరణ, రహదారుల విస్తరణ వంటి ఎన్నో పనులు చేపట్టాల్సిఉంది. అధికారులు ప్రస్తుతం వాటికి టెండర్లు ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. కొన్ని పనులకు టెండర్లు ఆహ్వానించకుండా నామినేషన్లపైనే అప్పగించాలని టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పైగా వారైతే నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేస్తారని, బయటి నిర్మాణ సంస్థలు అలా చేయలేవని చెప్పడం గమనార్హం. ఒకే పని.. ‘రెండు, మూడు’గా విభజించి కట్టబెట్టే యత్నం.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులకు రూ.10 లక్షల విలువైన పనులను మాత్రమే నామినేషన్ల పద్ధతిపై కేటాయించే అవకాశం ఉంది. అంతకుమించితే ఆ పనులకు టెండ ర్లను ఆహ్వానించాల్సిందే. టీడీపీ నాయకుల ఒత్తిడికి తట్టుకోలేక కొందరు అధికారులు రూ.10 లక్షల కంటే విలువైన పనులనూ రెండు లేదా మూడు పనులుగా విభజించి వాటిని నామినేషన్‌పై కేటాయించాలని యత్నిస్తుట్లు సమాచారం. దీంతో కంట్రాక్టర్లకు మొండిచేయి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాపకింద నీరులా సాగుతున్న ఈ విధానంతో అనుభవం ఉన్న నిర్మాణ సంస్థలకు పనులు లభించకపోవడమే కాక ఎలాంటి అనుభవం లేని సాధారణ నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లవుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త నిర్మాణాలపై ఆశలు.. పుష్కర ఘాట్ల మరమ్మతులు, కొత్త ఘాట్ల నిర్మాణాలను సాగునీటిశాఖ ఎక్కువగా చేపట్టనున్నది. ఈ శాఖలో ఎప్పటి నుంచో పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలు 50 వరకు ఉన్నాయి. ఈ సంస్థల ప్రతినిధులంతా పుష్కర పనులపైనే ఆశలు పెంచుకున్నారు. మిగిలిన పనుల కంటే పుష్కర పనులను వేగంగా పూర్తిచేయడమే కాకుండా బిల్లుల చెల్లింపు కూడా అంతే వేగంగా జరిగే అవకాశం ఉండటంతో వారంతా వీటి కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ.50 కోట్లకుపైగానే పుష్కర ఘాట్ల మరమ్మతులు, కొత్త నిర్మాణాలు జరిగే అవకాశం ఉందని, అందులో కొన్నింటిని టెండరు విధానంలో దక్కించుకోవచ్చనే ఆశతో ఉన్నారు. రోడ్లు భవనాలశాఖలో రూ.40 కోట్లతో రహదారుల విస్తరణ, మరమ్మతులు చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్‌తో సంప్రదించిన తరువాతనే టెండర్లపై నిర్ణయం తీసుకుంటామని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారుల పరిస్థితి.. అడకత్తెరలో పోకచెక్క.. పుష్కరాల నేపథ్యంలో గుంటూరు నగరంలో రహదారుల విస్తరణ, రోడ్ల మార్జిన్లలోని ఆక్రమణల తొలగింపు, అలంకరణ, పచ్చదనం వంటి పనులను నగరపాలక సంస్థ చేపట్టనుంది. ఈ మేరకు కమిషనర్, ఇతర అధికారులు విస్తరణ చేపట్టాల్సిన రహదారులను గుర్తించి టెండర్లు ఆహ్వానించే పనిలో ఉన్నారు. రోడ్ల మార్జిన్ల ఆక్రమణల తొలగింపులో ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కొందరు అధికారులకు దిక్కుతోచడం లేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల మధ్య సిబ్బంది, అధికారులు అడకత్తెరలో పోకచెక్కవలే నలిగిపోతున్నారు. ఆక్రమణలను తొలగించకపోతే ఉన్నతాధికారుల నుంచి చర్యలు ఉంటాయని, తొలగిస్తే ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. కొందరు ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా వ్యవహరించే ఉన్నతాధికారిని ప్రత్యేక అధికారిగా తీసుకువస్తే పరిస్థితులు సానుకూలమవుతాయనే భావనలో ఉన్నారు. అవసరమైతే ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. -
పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా పుష్కరాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, మాణిక్యలరావులను ఉపసంఘంలో సభ్యులుగా నియమించారు. ఈ సమావేశానికి మంత్రులు మాణిక్యలరావు, చినరాజప్పతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. -
రూ.300 కోట్లతో పుష్కరాల పనులు
కలెక్టర్ కాంతిలాల్ దండే గుంటూరు ఈస్ట్ : జిల్లాలో రూ.300 కోట్లతో కృష్ణా పుష్కరాల పనులు చేస్తామని కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. కలెక్టరేట్లో ముఖ్యమంత్రి నిర్దేశించిన అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. కాంతిలాల్ దండే మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా గుంటూరు, మంగళగిరి సుందరీకరణ, ఘాట్లకు అప్రోచ్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో కొన్నింటిని గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు నిర్ణయించారని అందుకు సంబంధించిన హాస్టల్స్‌ను గుర్తించాలని ఆదేశించారు. వేసవిలో మంచినీరు సమస్య తలెత్తకుండా ప్రైవేటు ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాలని సూచించారు. సంయుక్త కలెక్టర్ సి.హెచ్.శ్రీధర్ మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానం అన్ని శాఖల్లో అమలు చేస్తున్నామని అందుకు గాను అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని పేర్కొన్నారు. జన్మభూమి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని తెలిపారు. డ్వామా, డీఆర్డీఏ, వ్యవసాయ శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని కోరారు. కలెక్టర్ ఆగ్రహం పంచాయితీ రాజ్ శాఖ సీసీ రోడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయమై ఆ శాఖ ఎస్ఈ జయరాజును కలెక్టర్ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో ఒక రోజుకు 4.5 కిలోమీట్లర చొప్పున రోడ్లు నిర్మిస్తుండగా జిల్లాలో 1.5 కిలోమీటర్లు మాత్రమే రోడ్ల నిర్మాణం జరగడమేమిటని ప్రశ్నించారు. ఇంజినీర్లు తన మాట వినడం లేదని ఎస్ఈ సమాధానం చెప్పారు. అందుకు కలెక్టర్ స్పందిస్తూ శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్వో నాగబాబు, సంయుక్త కలెక్టర్ -2 వెంకటేశ్వరావు పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కరాలనూ విజయవంతం చేయాలి
మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన తరహాలోనే ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంత్రులు, అధికారులను ఆదేశించారు. అవసరమైతే గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించిన కలెక్టర్లు, ఇతర అధికారుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే సమయం లో కృష్ణా పుష్కరాలు నిర్వహించాల్సి ఉన్నం దున ఏర్పాట్లపై వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు సత్యానారాయణ, శ్రీదేవి తదితరులతో కేసీఆర్ ఆదివారం కృష్ణా పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 50 వరకు ఘాట్లు నిర్మించాలని, కృష్ణానది వరకు వెళ్లేందుకు సరైన రోడ్డు వసతి లేని చోట్ల యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ దేవాలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఏర్పాట్లు చేయాలని, నదీ తీరం వద్ద ఉండే ఇతర ఆలయాల వద్ద కూడా ఏర్పాట్లు చేయాలన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, బాచుపల్లి, వాడేపల్లి, మట్టపల్లి, కొల్లాపూర్, సోమశిల, పెబ్బేరు, జూరాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.