అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది: చంద్రబాబు | normal rush in krishna pushkaram starting day due to sravana sukravaram, says chandrababu | Sakshi
Sakshi News home page

అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది: చంద్రబాబు

Published Fri, Aug 12 2016 8:30 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది: చంద్రబాబు - Sakshi

అందుకే భక్తుల రద్దీ తక్కువగా ఉంది: చంద్రబాబు

విజయవాడ : శ్రావణ శుక్రవారం కావడం వల్ల కృష్ణా పుష్కరాల తొలి రోజు భక్తుల రద్దీ తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని దుర్గాఘాట్లో చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ....రేపటి నుంచి అంటే శనివారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాలు సందర్బంగా పవిత్ర సంకల్పాన్ని చేపట్టామని చెప్పారు.

కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా బస్సుల రద్దీని క్రమబద్దీకరిస్తున్నామన్నారు. విజయవాడ నగరంలో కొన్ని గుళ్లు తొలగించామని కొందరు గగ్గోలు పట్టారు.... అయినప్పటికీ చేయాల్సిన అభివృద్ధి చేయగాలిగామన్నారు. ప్రత్యేక హోదా కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement