అనుమానంతోనే చంపేశాడు | With suspicion, and killed | Sakshi
Sakshi News home page

అనుమానంతోనే చంపేశాడు

Dec 8 2016 10:33 PM | Updated on Jul 30 2018 8:29 PM

మండలంలోని నరసాపురానికి చెందిన గంగా సులోచన హత్య కేసు మిస్టరీ వీడింది. అనుమానం భర్త పాల వెంకటరామిరెడ్డే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

నార్పల: మండలంలోని నరసాపురానికి చెందిన గంగా సులోచన హత్య కేసు మిస్టరీ వీడింది. అనుమానం భర్త పాల వెంకటరామిరెడ్డే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడ్ని ఎట్టకేలకు అరెస్టు చేసి రిమాండ్‌కు గురువారం తరలించినట్లు ఎస్‌ఐ రాంప్రసాద్‌ విలేకరులకు గురువారం తెలిపారు. వెంకటరామిరెడ్డి మొదటి భార్య విద్యుదాఘాతానికి గురై రెండేళ్ల కిందట మరణించడంతో పెద్దపప్పూరు మండలం గంగా సుంకేసుల గ్రామానికి చెందిన గంగా సులోచనను అతను  రెండో పెళ్లి చేసుకున్నాడన్నారు. కొన్ని రోజులు వీరి సంసారం సజావుగా సాగినా ఆ తరువాత అతనిలోని రాక్షసుడు మేల్కొన్నాడని ఎస్‌ఐ తెలిపారు. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఆమెను హతమార్చినట్లు చెప్పారు. ఆ తరువాత మృతదేహాన్ని తీసుకెళ్లి గ్రామ సమీపంలోని హెచ్‌ఎల్‌సీ కాలువలో పడేసినట్లు తెలిపారు. ఆ తరువాత తన భార్య కనబడటం లేదంటూ నవంబర్‌ 12న తమకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే అదే నెల 14న ఊహించని విధంగా గంగా సులోచన మృతదేహం కాలువలో పడి ఉండగా గుర్తించారు.  గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ కేసును పక్కదారి పట్టించేందుకు మళ్లీ ఎత్తు వేశాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హతమార్చినట్లు అంగీకరించాడు. నిందితుడ్ని అనంతపురం కోర్టులో హాజరుపరిచామన్నారు,  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement