కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య | women suicide with stomach pain | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

Published Sun, Aug 21 2016 12:25 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

women suicide with stomach pain

పరకాల:  కడుపు నొప్పి భరించలేక ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో శనివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హెడ్‌ కానిస్టేబుల్‌ కట్టయ్య కథనం ప్రకారం.. ఎరుకుల సుశీల, జయపాల్‌ దంపతుల కుమార్తె ప్రవళిక(26)ను అదే గ్రామానికి చెందిన గోనె రాజుకు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. ప్రవళిక, రాజు దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. ప్రవళిక కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక, ఇంట్లో ఉన్న  పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి జయపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement