జోరు వానలో జీవన నావ
జోరు వానలో జీవన నావ
Published Mon, Oct 3 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) గిత్తల గిట్టలచప్పుడుకు రైతు గుండెచప్పుడు జత కలిసింది..గడ్డిమోపుతో మహిళ శ్రమైక జీవనాన్ని కళ్లకు కట్టింది..సరుకు అమ్ముడుపోవాల..బిడ్డల కడుపు నిండాల అంటూ బతుకు బండి ముందుకు కదిలింది. పసిబిడ్డల్లాంటి పంట పొలాలకు జీవం పోయాలంటూ కూలీల యంత్రం పరుగు తీసింది..ఇంతలో చిటపటమంటూ చినుకు చిందేసింది. ఎండైనా వానైనా లెక్కచోయబోమంటూ శ్రమజీవుల చెమట చుక్క జీవన పోరు సాగించింది. ప్రత్తిపాడులో సోమవారం కురిసిన వర్షంలో ఇలా శ్రమ జీవుల బతుకు నావ మమేకమైంది.
Advertisement