కూడేరు: మండల పరిధిలోని ఉదిరిపికొండ సమీపాన ఆదివారం అనంతపురం–బళ్ళారి ప్రధాన రహదారిపై లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న సంఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు అందించిన వివరాలు మేరకు విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన వన్నూరుస్వామి (32) ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి వెళుతున్నాడు. ఉరవకొండ నుంచి అనంతపురం వైపు లారీ వస్తోంది. సంఘటనా స్థలానికి రాగానే లారీ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. దీంతో వన్నూరు స్వామి అక్కడిక్కడే మృతి చెందాడు.
మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
Published Sun, Oct 9 2016 11:43 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement