పోలీస్ క్వార్టర్స్‌లో యువకుడి ఆత్మహత్య | youth suicide in police quarters | Sakshi
Sakshi News home page

పోలీస్ క్వార్టర్స్‌లో యువకుడి ఆత్మహత్య

Published Sun, Sep 4 2016 1:21 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

youth suicide in police quarters

కరీంనగర్: ఉద్యోగం పోయిందని మనస్తాపం చెందిన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కొడిమ్యాల పోలీస్ క్వార్టర్స్‌లో ఆదివారం వెలుగుచూసింది. క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ తిరుపతి మేనల్లుడు శ్రీకాంత్ (26) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

శ్రీకాంత్ రెండేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్య ఆ ఉద్యోగం పోవడంతో.. మేనమామ ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement