ప్రస్తుతం అంతా కార్పొరేట్ మయం.. సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే స్కిల్స్‌కే అధిక ప్రాధాన్యమిస్తున్న తరుణం.. శరవేగంగా మారుతున్న ప్రపంచంలో అందరిని అధిగమించి.. విజయం సాధించాలంటే.. పరిస్థితులకనుగుణంగా తమను తాము అన్వయించుకుంటూ..
ప్రస్తుతం అంతా కార్పొరేట్ మయం.. సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే స్కిల్స్‌కే అధిక ప్రాధాన్యమిస్తున్న తరుణం.. శరవేగంగా మారుతున్న ప్రపంచంలో అందరిని అధిగమించి.. విజయం సాధించాలంటే.. పరిస్థితులకనుగుణంగా తమను తాము అన్వయించుకుంటూ.. అటు అకడమిక్‌తోపాటు.. ఎంతో కీలకమైన సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటూ.. ముందుకు సాగితేనే కెరీర్ అనే మ్యాచ్‌లో విన్నింగ్ షాట్‌ను సంధించడం సాధ్యమవుతుంది.. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఈ దిశగా ప్రయత్నం ప్రారంభించాలి.. అప్పుడే విజయవంతమైన కెరీర్‌కు పునాది ఏర్పడడంతోపాటు పరిశ్రమ ఆశిస్తున్న విధంగా జాబ్ రెడీగా ఉండడం సాధ్యం.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యత, తదితర అంశాలపై ఫోకస్..
వి. ఉమా మహేశ్వర్,
ప్లేస్‌మెంట్ ఆఫీసర్,
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ.
పోటీ ప్రపంచంలో డిగ్రీ పట్టా చేత పట్టుకొని బయటకు అడుగుపెడుతూనే టాప్ కంపెనీలో.. మెచ్చిన ఉద్యోగంలో స్థిరపడాలన్నా.. స్వల్ప కాలంలోనే ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నా సబ్జెక్టులో పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు.. జాబ్ మార్కెట్ డిమాండ్‌కనుగుణంగా ‘సాఫ్ట్ స్కిల్స్’ కూడా ఎంతో అవసరం.. గతంతో పోల్చితే ప్రస్తుతం కంపెనీల పనితీరులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పరిస్థితులకనుగుణంగా మల్చుకుంటూ.. పోటీ వాతావరణంలో కంపెనీ/సంస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టే నైపుణ్యం గల మానవ వనరులను నియమించుకోవడానికి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. అటువంటి సామర్థ్యాలు గల వారికే రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. దీంతో ఉద్యోగార్థులకు సంప్రదాయ అర్హతల (సబ్జెక్ట్ స్కిల్స్)తో పాటు సాఫ్ట్ స్కిల్స్ అవసరం కూడా పెరిగింది.
కీలకం:
ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశించిన విద్యార్థి ప్రధానంగా గమనించాల్సిన అంశాలు.. ఇంటర్మీడియెట్ మాదిరిగా స్పూన్ ఫీడింగ్ ఉండదు. ఇంజనీరింగ్‌లో పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి స్వీయ ప్రిపరేషన్ (సెల్ఫ్ లెర్నింగ్ మోడ్) దిశగా అడుగులు వేయాలి. అకడమిక్స్‌తో సమానంగా సాఫ్ట్‌స్కిల్స్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచం విద్యార్థుల్లో ఉండాలని ఆశిస్తున్న లక్షణాలను మెరుగుపరుచు కోవాలి. అలాంటి నైపుణాల్లో ప్రధానమైనవి.. భావ వ్యక్తీకరణ నైపుణ్యం (కమ్యూనికేషన్ స్కిల్స్), బృందంగా పని చేసే నైపుణ్యం (టీమ్ వర్కింగ్), నాయకత్వ లక్షణాలు (లీడర్‌షిప్), సృజనాత్మకత (క్రియేటివిటీ), సమయస్ఫూర్తిగా వ్యవహరించడం (ఫ్లెక్సిబిలిటీ) ముఖ్యమైనవి. ఈ లక్షణాల ప్రాముఖ్యతను పరిశీలిస్తే..
ప్రభావవంతంగా:
సాఫ్ట్ స్కిల్స్‌లో ప్రధానమైంది.. కమ్యూనికేషన్ స్కిల్స్ (భావ వ్యక్తీకరణ నైపుణ్యం). ఒక అంశాన్ని ప్రభావవంతంగా వ్యక్తం చేయడంలో కమ్యూనికేషన్ పాత్ర కీలకం. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు విద్య, ఉద్యోగం ఇలా.. ఏవిధంగా చూసిన ఇతరులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భావ వ్యక్తీకరణకు కమ్యూనికేషన్ మినహా మరో మార్గం లేదు. కమ్యూనికేషన్ అంటే కేవలం సంభాషించడం వరకే పరిమితం అనుకుంటే పొరపాటే.
ఇందులో చదవడం, రాయడం, వినడం అనే నైపుణ్యాలు కూడా ఇమిడి ఉంటాయి. ఇంజనీరింగ్ కెరీర్‌లో ఇవి ఎంతో కీలక పాత్రను పోషిస్తారుు. కాబట్టి ఆయూ నైపుణ్యాల్లో పరిపూర్ణత సాధించడం తప్పనిసరి. వుుఖ్యంగా తమ కెరీర్‌లో వివిధ రకాల వ్యక్తులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి బిజినెస్ రైటింగ్, టెక్నికల్ రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్, ప్రెజెంటేషన్ వంటి నైపుణ్యాల్లో పరిపూర్ణత సాధించాలి. అన్నిటికంటే కీలకమైంది.. వినటం. ఈ అంశంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే.. విషయాన్ని సరిగ్గా కమ్యూనికేట్ చేయలేం. తద్వారా ఏర్పడే మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఎంతో విలువైన అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. ఫలితంగా క్లయింట్స్, ప్రాజెక్ట్ పార్టనర్స్, తోటి ఉద్యోగులతో ప్రాబ్లమ్ సాల్వింగ్ కష్టమవుతుంది.
చాలా మంది ఇంజనీరింగ్ నిపుణులు కమ్యూనికేషన్స్ స్కిల్స్‌కు అంతగా ప్రాముఖ్యతనివ్వరు. తమ సాంకేతిక సామర్థ్యాల (టెక్నికల్ నాలెడ్జ్)తో సమస్యను అధిగమించాలని ప్రయత్నిస్తుంటారు. కానీ నేటి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని సమర్థంగా నిర్వహించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. కాబట్టి ఈ అంశంపై పట్టు సాధించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే కృషి చేయాలి. ఇందుకు కాలేజీని చక్కటి వేదికగా వినియోగించుకోవాలి. కాలేజీలో అందరితో ఇంటరాక్షన్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. గ్రూప్ డిస్కషన్, టీమ్ ఈవెంట్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాలుపంచుకోవాలి. తద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు.
టీమ్ మ్యాన్:
ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచం సమిష్టి త త్వానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఉద్యోగులందరూ ఒక జట్టుగా పని చేసినప్పుడే అత్యుత్తమ ఫలితాలు సాధ్యం అని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమ్ మ్యాన్/వర్కింగ్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయి. దానికితోడు కంపెనీల్లో పలు విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో నూతనంగా నియమించుకునే ఉద్యోగార్థుల్లో టీమ్ వర్కింగ్ స్కిల్స్ ఉన్నాయా? లేవా? అని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. తోడ్పాటు (Collaboration), సహకారం (Coop eration), బృందంగా పని చేయడం (Teamwork).. ఇలా ఏ పేరుతో వ్యవహరించినా ఇంజనీరింగ్ విద్యార్థి తన కెరీర్‌లో ఇతరుల భాగస్వామ్యంతో కలిసి పనిచేయడం తప్పనిసరి.
కాబట్టి విద్యార్థులు బృందంగా పనిచేసే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. అప్పుడే కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో భాగమయ్యే అవకాశం దక్కుతుంది. ఇందుకోసం కాలేజీల్లో వివిధ రకాల ఈవెంట్లను, టెక్నికల్ ఫెస్టివల్స్, సెమినార్స్ వంటి వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది.
దార్శనికత:
భావి ఇంజనీర్ల నుంచి కంపెనీలు ఆశిస్తున్న మరో నైపుణ్యం.. లీడర్‌షిప్ స్కిల్స్. అధిక శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ఉద్యోగ పరిధికే పరిమితం కావడానికి ఇష్టపడుతుంటారు. అలా కాకుండా దార్శనికతతో ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధంగా ఉండడం, టీమ్‌కు మార్గనిర్దేశనం చేయడం, వినూత్నంగా ఆలోచించడంతోపాటు వాటిని అమలు చేయడం వంటి అంశాల్లో చురుగ్గా వ్యవహరించే నైపుణ్యాలున్న వారిని రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీలు సదా సిద్ధంగా ఉంటాయి.
ప్రొఫెషనల్‌గా మన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి చక్కని అవకాశంగా కూడా నాయకత్వ లక్షణాలు నిలుస్తాయి. కంపెనీ వ్యవహారాల్లో చొరవ తీసుకోవడం, ఫలితాన్ని ముందుగా అంచనా వేయడం, సమయానుకూలంగా సవుయుస్ఫూర్తిగా నిర్ణయం తీసుకునే నేర్పు, ఇచ్చిన బాధ్యతను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడం, టీమ్ సభ్యుల్లో విశ్వాసం కలిగించడం వంటి అంశాలు నాయకత్వం నైపుణ్యాల కోవకు చెందుతాయి.
ఇందుకోసం కాలేజీలో జరిగే టెక్నికల్ ఫెస్టివల్స్, ఇంటర్-కాలేజ్ స్పోర్ట్స్, సెమినార్ల నిర్వహణ, సంబంధిత కార్యకలాపాల బాధ్యతలను చేపట్టడం వంటి అంశాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చు. అంతేకాకుండా గ్రూప్ యాక్టివిటీస్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా కూడా నాయుకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవచ్చు.
సమయస్ఫూర్తి:
నిత్యం ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటికనుగుణంగా మనల్ని అన్వయించుకుంటూ.. పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ సవుయుస్ఫూర్తిగా ముందుగు సాగే వారికి విజయం సాధ్యమవుతుంది. ఈ అంశం ఇంజనీరింగ్ రంగానికి సరిగ్గా సరిపోతుంది. ఇంజనీరింగ్ రంగంలో ఎప్పటికప్పుడు..ఆర్థికంగా, సాంకేతికంగా ఎన్నో మార్పులు, సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒక్కసారిగా మొత్తం పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. అటువంటి పరిస్థితులకనుగుణంగా మల్చుకునే సావుర్థ్యం ఉన్న వారినే నియమించుకోవడానికి కంపెనీలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నియూవుక సవుయుంలోనే ఒక సమస్యను ఏవిధంగా చూస్తున్నారు..ఎటువంటి పరిష్కార మార్గాలను ఆలోచిస్తున్నారు.. అనే కోణంలో అభ్యర్థిని విశ్లేషిస్తున్నాయి. కాబట్టి పరిస్థితులను బట్టి సమయస్ఫూర్తిగా వ్యవహరించే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. ఇక్కడ మరొక అంశాన్ని కూడా గమనించాలి.. మార్కెట్‌లో రోజుకో నూతన టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. వీటిని ఆయా కంపెనీలు తమ దైనందిన కార్యకలాపాల్లో అంతేవేగంగా అమలు చేస్తున్నాయి. ఈ నే పథ్యంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మనల్ని నిత్యం అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి.
ఉన్నత శిఖరాల దిశగా:
విజయవంతమైన ఇంజనీరింగ్ కెరీర్‌కు కావల్సిన మరో ముఖ్య లక్షణం.. సృజనాత్మకత. సాంకేతిక నైపుణ్యానికి సృజనాత్మకత తోడైతేనే కెరీర్‌లో ఉన్నత శిఖరాలను స్వల్ప కాలంలోనే అందుకోవడం సాధ్యమవుతుంది. ఇంజనీర్ ప్రాథమిక బాధ్యత ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థలను సరళంగా, మరింత చవకగా నాణత్యతో తిరిగి అందించడమే. ఈ దిశగా కల్పనలు చేయాలంటే సృజనాత్మకత తప్పనిసరి. సాధారణంగా ఇంజనీర్లకు నూతన కల్పనలు చేసే విధంగా శిక్షణనిస్తారు.
కానీ చాలా మంది ఉన్న వ్యవస్థలోనే పని చేయడానికి ఇష్టపడుతూ.. ఆ దిశగా ప్రయత్నం చేయరు. అలా కాకుండా కంపెనీ శ్రేయస్సు కోసం సృజనాత్మకత, నూతన ఆలోచనలతో ఉండే వారికి ఎప్పుడూ ప్రాధాన్యత లభిస్తుంది. వీరినే విలువైన వనరులుగా కంపెనీలు భావిస్తారుు. ఈ నేపథ్యంలో కంపెనీలు నియామక ప్రక్రియలో సృజనాత్మకత అనే అంశానికి అధిక ప్రాముఖ్యతనిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ కొత్త ఆలోచనలు చేయగల సామర్థ్యం ఉందా? లేదా? అనే అంశాన్ని నియూవుక సవుయుంలో నిశితంగా పరీక్షిస్తున్నాయి.
ఇంగ్లిష్ మస్ట్:
ప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇంగ్లిష్ భాషపై పట్టు తప్పనిసరి. కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఈ దిశగా ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడి యం విద్యార్థులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ద హిందూ, ఎకనమిక్ టైమ్స్ వంటి దినపత్రికలతోపాటు అవుట్‌లుక్, ఇండియా టుడే వంటి మ్యాగజైన్లు చదవడం, బీబీసీ, సీఎన్‌బీసీ-టీవీ18, వంటి చానల్స్ చూస్తూ వినడం ద్వారా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు.
స్వతహాగా:
గత కొన్నేళ్ల క్యాంపస్ ప్లేస్‌మెంట్ తీరుతెన్నులను పరిశీలిస్తే.. బ్రాంచ్ ఏదైనా విద్యార్థిలో తాము కోరుకున్న స్కిల్స్ విషయంలో కంపెనీలు చాలా స్పష్టంగా వ్యవహరిస్తున్నాయి. అన్ని రకాలుగా ఒకటికి రెండుసార్లు పరీక్షించిన తర్వాతే అవకాశాలిస్తున్నాయి. దీన్ని బట్టి ఒక విషయం మాత్రం స్పష్టం.. విజయవంతమైన ఇంజనీరింగ్ కెరీర్‌కు సాంకేతిక నైపుణ్యంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం.
సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏదో క్లిష్టమైన వ్యవహారంగా చూడాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే సాఫ్ట్‌స్కిల్స్ మనలోని అంతర్గత (మనోద్వేగానికి సంబంధించిన) లక్షణాలు. వీటిని అకడమిక్ కార్యకలాపాల మాదిరిగా తరగతి గదిలో నేర్చుకోవడం సాధ్యం కాదు. సమాజం, తోటి విద్యార్థులతో మమేకం అవుతూ ప్రేరణ పొందడం ద్వారా స్వతహాగా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.
మెరుగుపర్చుకోండిలా..
1. సాఫ్ట్ స్కిల్స్‌ను అవసరమైనప్పుడు నేర్చుకోవచ్చు అనే ఆలోచనతో కాకుండా కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఆ దిశగా ప్రయత్నం చేయాలి.
2.సాఫ్ట్ స్కిల్స్‌పై పట్టు సాధించడం ఒక్క రోజులోనే సాధ్యమయ్యే పని కాదు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ.
3.అకడమిక్ కార్యకలాపాలతో మమేకమవుతూ వ్యక్తిగతంగా, స్నేహితుల సహకారంతో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి.
4.రోజు సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరుచుకునే దిశగా గ్రూప్ డిస్కషన్స్, పబ్లిక్ స్పీకింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్‌పై ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించుకోవాలి.
5.సీనియర్లు, నిపుణులను ప్రాక్టీస్ సెషన్స్‌కు ఆహ్వానించి వారి విలువైన సూచనలను పొందాలి.