'పొన్నాలను ఓడించేందుకే రెబెల్‌గా పోటీచేస్తున్నా' | Bakka Jadson committed to defeat Ponnala Lakshmaiah | Sakshi
Sakshi News home page

'పొన్నాలను ఓడించేందుకే రెబెల్‌గా పోటీచేస్తున్నా'

Published Sun, Apr 13 2014 12:40 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

Bakka Jadson committed to defeat Ponnala Lakshmaiah

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ టికెట్లు అమ్ముకున్నారని జనగామలో ఆయనపై తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బక్క జడ్సన్ ఆరోపించారు. వరంగల్ జిల్లాలో పార్టీ కోసం పనిచేసిన నేతలను పక్కకుపెట్టారని వాపోయారు. కోడలు వైశాలికి కూడా టిక్కెట్ ఇవ్వకుండా ఎర్రబెల్లి స్వర్ణకు ఇచ్చారని తెలిపారు. తనకు, మనోరెడ్డికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నమ్మిన నేతలను వాడుకుని వదిలేయడం పొన్నాల నైజమని విమర్శించారు. తనలాంటి దళిత నేతలకు చాలామందికి అవమానం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఏనాడూ పొన్నాల సహకరించలేదన్నారు. పొన్నాలను ఓడించేందుకే ఆయనపై రెబెల్‌గా పోటీచేస్తున్నానని జడ్సన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement