మోడీ ఓ రాక్షసుడు: బేణీ ప్రసాద్ | beni prasad takes on narendra modi | Sakshi
Sakshi News home page

మోడీ ఓ రాక్షసుడు: బేణీ ప్రసాద్

Published Sun, May 4 2014 3:54 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మోడీ ఓ రాక్షసుడు: బేణీ ప్రసాద్ - Sakshi

మోడీ ఓ రాక్షసుడు: బేణీ ప్రసాద్

 లక్నో: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీప్రసాద్ వర్మ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై మాటల దాడిని తీవ్రతరం చేశారు. మరోసారి అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధం విధిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరించినా ఆయన వెనక్కు తగ్గలేదు. మోడీ మనిషి కాదని, ఆయనో రాక్షసుడని బేణీ మండిపడ్డారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న రాక్షసుడని మోడీని దుయ్యబట్టారు. శుక్రవారం రాత్రి యూపీలోని మస్కన్వాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గోధ్రా నరమేధంపై మోడీ స్పందించిన తీరు దారుణమన్నారు. మోడీ విద్యార్హతలపైనా బేణి విమర్శలు గుప్పించారు. తాను లక్నో విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందానని మోడీ 18 ఏళ్ల వయసులో చాయ్ అమ్ముకునేందుకు ఇంటి నుంచి పారిపోయారని చెప్పారు. మోడీ డిగ్రీ పట్టా నకిలీదని తనలాంటి విద్యావంతుడితో ఆయనెలా పోటీ పడగలరని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement