తెలంగాణలో వద్దు.. కేంద్రంలో ముద్దు!
ఎన్నికల తరువాత టీఆర్‌ఎస్ మద్దతుపై పొన్నాల లక్ష్మయ్య
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మద్దతు తీసుకునే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేంద్రంలో మాత్రం అవకాశాన్ని బట్టి టీఆర్‌ఎస్‌ను యూపీఏలో భాగస్వామ్యం కావాలని కోరతామని చెప్పారు. గాంధీభవన్‌లో మంగళవారం పొన్నాల మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పచ్చి అవకాశవాది అని విమర్శించారు.
2004లో కాంగ్రెస్‌కు, 2009లో ఎన్డీయేకు మద్దతు పలికిన కేసీఆర్ ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అంటూ మూడు నాల్కల ధోరణితో మాట్లాడుతుండు’’అని దుయ్యబట్టారు. సీపీఎం, ఎస్పీ, డీఎంకే, అన్నాడీఎంకే, జేడీయూసహా థర్డ్‌ఫ్రంట్‌లో ఉన్న పార్టీలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాడినవేనని, అలాంటి పార్టీలతో టీఆర్‌ఎస్ ఎట్లా జతకడుతుందని ప్రశ్నించారు.