అవినీతి కాంగ్రెస్‌కు చరమగీతం పాడండి
టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు
కర్నూలు : ‘పదేళ్ల కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో ప్రజలు కష్టాలు పడ్డారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. సోనియాగాంధీ ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించింది. సీమాంధ్ర ప్రజల పొట్ట కొట్టింది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడండి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపుని చ్చారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లాలోని కోసిగి, ఆత్మకూరు, ఆలూరు రోడ్‌షోల్లో ప్రసగించారు.
అవినీతి లో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. టైటానియం స్కామ్‌లో ఉన్న కేవీపీ రామచంద్రరావును అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని, ఆయన్ను అరెస్టు చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వారికి అండగా మేముంటాం. ఉపాధి, విద్య, వైద్యం, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన కల్పించాలి. ఆ లక్ష్య సాధన కోసమే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం తప్ప మరొక ఉద్దేశం లేదు’ అని స్పష్టం చేశారు.