విమర్శలను బహుమతిగా ఇస్తే తిరస్కరిస్తా..
రాయ్‌బరేలీ: తన కుటుంబంపై వస్తున్న వ్యక్తిగత విమర్శలను తాను పెద్దగా పట్టించుకోబోనని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు తనకు విమర్శలను బహుమతులుగా ఇవ్వాలని భావించినట్లయితే వాటిని తిరస్కరించే హక్కు తనకు ఉందని రాయ్‌బరేలీలో సోమవారం చెప్పారు. తన భర్త రాబర్ట్ వద్రాపై విమర్శలను బీజేపీ నేతలు మరింత తీవ్రం చేయడంతో ప్రియాంకాగాంధీ స్పందించారు. తన కుటుంబంపైనా, తనపైనా చేసే వ్యక్తిగత విమర్శల వల్ల తనకు బాధలేదని, అటువంటి వాటిని తాను పెద్దగా పట్టించుకోబోనన్నారు.