ఎంపీ, ఎమ్మెల్యే నామినేషన్ల్లకు నిబంధనలివే
ఫారం26 పూర్తి చేయకపోతే తిరస్కరణే
గతంలో నామినేషన్‌తో పాటు అభ్యర్థుల అప్పులు, ఆస్తులతో పాటు నేరాభియోగాలకు సంబంధించిన అఫిడివిట్‌ను విడివిడిగా దాఖలు చేసేవారు. ఈ ఎన్నికల్లో కొన్ని మార్పులు చేశారు. రూ. 10 బాండ్ పేపరుపై నోటరీ చేసిన ఫారం 26ను సమర్పించాల్సి ఉంది. నామినేషన్ చివరి రోజు 3 గంటల వరకు దాఖలు చేసే అవకాశం ఉంది. ఖాళీలు వదిలినా, డాష్(-) రాసిన నామినేషన్‌ను తిరస్కరిస్తారు. వాటిల్లో లోటు పాట్లపై రిటర్నింగ్ అధికారి అభ్యర్థులకు నోటీసులు జారీ చేస్తారు. నామినేషన్లు ఉపసంహరణ గడువుకు ముందు సరిచేసి ఇస్తే సరిపోతుంది.
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. జిల్లా లో నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు 10 అసెం బ్లీ స్థానాలకు మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి శనివారం నోటిఫికేషన్ విడుద లైంది. ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రకారం పార్లమెంటు, అసెం బ్లీకి పోటీ చేసే అభ్యర్థులు పలు సూచనలు పాటించాల్సి ఉంది. తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 25 ఏళ్లు పూర్తి కావాలి. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా ఓటరుగా నమోదై ఉండాలి. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు రూ. 25 వేలు డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ. 12,500 చెల్లిస్తే సరిపోతుంది. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు రూ. 10వేలు డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీలు తప్పని సరిగా కుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్లు నామినేషన్లు దాఖలు చే యాలి. నామినేషన్లు సమయంలో గుర్తింపు పొందిన పార్టీలకు ప్రతిపాదకులుగా నియోజకవర్గానికి చెందిన వారు ఒకరుంటే సరిపోతుంది. గుర్తింపు పొంద ని పార్టీలకు 10 మంది ప్రతిపాదులుగా ఉండాలి. లోక్‌సభ నామినేషన్‌కు ఫారం 2ఏ పూర్తి చే యాలి. అసెంబ్లీ నామినేషన్‌కు ఫారం 2బీ భర్తీ చేయాలి. లోక్‌సభ అభ్యర్థి రూ. 70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థి రూ. 28 లక్షలకు ఖర్చు మించరాదు.
నామినేషన్ ముందే బ్యాంకు ఖాతా తెరవాలి
ఈ సారి ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన విధించింది. లోక్‌సభ, అసెంబ్లీకి పోటీ చేసే వ్యక్తి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందే విధిగా జాతీయ బ్యాం కులో ప్రత్యేక ఖాతా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాలి. నామినేషన్ డిపాజిట్ మొదలుకుని ఏ ఖర్చులైనా ఈఖాతా ద్వారానే జరపాల్సి ఉంటుంది.
రూ. 20 వేలుకు మించిన ఖర్చుకు తప్పని సరిగా చెక్కులు ఇవ్వాలి. ఒకే సారి రూ. 20 వేలు వరకు డ్రా చేసుకుని చిల్లర ఖ ర్చులు పెట్టవచ్చు. ఆయా ఖర్చులకు సంబంధించి బిల్లులు లెక్కలు మాత్రం సమర్పించాల్సి ఉంటుంది.
తడబడితే ఇబ్బందే
Published Sun, Apr 13 2014 3:50 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement