వారికి ఎన్నికలంటే భయం | For those who fear them is | Sakshi
Sakshi News home page

వారికి ఎన్నికలంటే భయం

Published Tue, Apr 1 2014 1:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

వారికి ఎన్నికలంటే భయం - Sakshi

వారికి ఎన్నికలంటే భయం

 కాంగ్రెస్, బీజేపీలపై కేజ్రీవాల్ ధ్వజం

 న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలంటే జంకుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలంటూ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌పై ఆ రెండు పార్టీలు ఒత్తిడి తెచ్చాయని ఆరోపించారు. రేపు ఎన్నికలు జరిగినా కూడా ఆప్ 50 స్థానాలు గెలుచుకుంటుందని, అందుకే ఎన్నికలు వాయిదాపడేలా ఆ రెండు పార్టీలూ గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చాయన్నారు.

 సోమవార ం ద్వారకలక్షలోజరిగిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ ప్రసంగించారు. అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు జరిపించాలంటూ తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని, దీనిపై అభిప్రాయం తెలపాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు పంపినా.. బీజేపీ, కాంగ్రెస్‌లు సమాధానమివ్వడానికి తాత్సారం చేస్తున్నాయన్నారు.
 
 8.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement