ఆయన ఆశీస్సులతో కేజ్రీ, మోదీ ఒక్కటయ్యారు!
న్యూఢిల్లీ: రాజకీయంగా ప్రతి విషయంలోనూ తిట్టుకునే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఒక్కటయ్యారని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఆశీస్సులు వారిద్దరినీ ఒక్కటి చేశాయని కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పర్యావరణ విఘాతానికి కారణమవుతున్న ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం విషయంలో కేజ్రీవాల్, మోదీ ఒక్కటయ్యారని విమర్శించింది.
ఢిల్లీలో యమునా నది ఒడ్డున జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని ఉండాల్సి కాదని, ఈ కార్యక్రమం విషయంలో హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ విమర్శలు చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తరహాలో ఈ కార్యక్రమానికి మోదీ దూరంగా ఉంటే బాగుండేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీఎల్ పూనియా అన్నారు. హరిత ట్రిబ్యునల్ విధించిన జరిమానా కట్టబోనని రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.