హారతులు పట్టిన మహిళలు
నేతలు, కార్యకర్తల ఘన స్వాగతం
నేడు, రేపు జిల్లాలో జనభేరి కార్యక్రమం
పలాస, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ జనభేరి పేరిట నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిం చారు. జిల్లాలో గురు, శుక్రవారాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తారు. పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం నియోజవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించి, జనభేరి సభలో పాల్గొంటారు. విజయనగరం జిల్లా పర్యటన ముగించుకున్న ఆయన ఆ జిల్లాలోని పార్వతీపురం నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల సమయంలో పలాస చేరుకున్నారు.
పట్టణ సరిహద్దులో జగన్‌కు ఘన స్వాగతం లభించింది. పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు, మాజీ కౌన్సిలర్ వజ్జ గంగాభవాని, పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. అక్కడి నుంచి వజ్జ బాబూరావు ఇంటికి చేరుకోగా అక్కడ మహిళలు హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ అక్కడున్న నాయకులు, కార్యకర్తలతో కాసేపు సంభాషించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, పార్టీ పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కమిటీ కన్వీనర్ బళ్ల గిరిబాబు, బీసీసెల్ కన్వీనర్ యవ్వారి మోహన్‌రావు, బోర భగవతి, బోర క్రిష్ణారావు, డబ్బీరు భవానీశంకర్, నందిగాం మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పేరాడ తిలక్, సాసుమాన చంద్రమోళి, డబ్బీరు నాగుతోపాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.