
జైరామ్ రమేష్
ఆదిలాబాద్ : డిసిసి అధ్యక్షుడు రామచంద్రారెడ్డి వర్గీయులపై కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జైరాం రమేష్ ఈరోజు ఆదిలాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సభావేదికపై నుంచే కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్‌గా ఎలా నామినేషన్ వేస్తారని రామచంద్రారెడ్డి వర్గీయులపై మండిపడ్డారు.
ఆదిలాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.