ఎన్నికల కోసం అనేకమంది విద్యార్థుల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. అయితే వారికి గౌరవ వేతనం ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం ముఖం చాటేసింది.
ఎన్నికల కోసం అనేకమంది విద్యార్థుల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. అయితే వారికి గౌరవ వేతనం ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం ముఖం చాటేసింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. విశ్వ విద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేశారు. తాము ఎన్నికల విధులలో పాల్గొన్నా, తమకు సరైన వేతనం ఇవ్వలేదంటూ వాళ్లు ధర్నాకు దిగారు.
జాయింట్ కలెక్టర్ను యూనివర్సిటీకి చెందిన ఎన్సీసీ విద్యార్థులు నిర్బంధించారు. ఇంజనీరింగ్, ఎంసీఏ చదివే విద్యార్థులను వెబ్కాస్టింగ్ కోసం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సహాయకులుగా, క్యూలైన్లను నిర్వహించడానికి నియమించుకున్న విషయం తెలిసిందే.