నేటితో నామినేషన్ల ఘట్టం పూర్తి | last day for nominations to general elections | Sakshi
Sakshi News home page

నేటితో నామినేషన్ల ఘట్టం పూర్తి

Published Wed, Apr 9 2014 3:02 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

last day  for nominations to general elections

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:  సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 3 గంటలతో ముగియనుంది. ఈ నెల 2వ తేదీన కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. తొమ్మిదో తేదీ చివరి తేదీగా ప్రకటించారు. మంగళవారం ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 34నామినేషన్లు దాఖలయ్యా యి. సత్తుపల్లిలో నాలుగు, కొత్తగూడెంలో ఐదు,  అశ్వారావుపేటలో ఐదు, భద్రాచలంలో ఐదు, ఇల్లెందులో నాలుగు, ఖమ్మంలో ఐదు, పాలేరులో రెండు, మధిరలో నాలుగు నామినేషన్లు దాఖల య్యాయి.

ఇప్పటి వరకు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు మొత్తం 83నామినేషన్లు దాఖలయ్యా యి. వాటిలో ఖమ్మం నియోజక వర్గం నుంచి 13, పినపాకకు నాలుగు, ఇల్లెందుకు 11, పాలేరుకు ఎనిమిది, మధిరకు పది, వైరాకు నాలుగు, సత్తుపల్లికి ఆరు, కొత్తగూడెంకు 15, అశ్వారావుపేటకు ఐదు, భద్రాచలంకు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం పార్లమెంటు స్థానానికి దొడ్డా రాంబాబు యాదవ్ మంగళవారం బీఎస్పీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకు 20 నామినేషన్లు దాఖలయ్యాయి.

 అసెంబ్లీ అభ్యర్థుల వివరాలివే..
 జిల్లావ్యాప్తంగా పది అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. పినపాక, వైరాలకు మాత్రం ఒక్కటి కూడా దాఖలు కాలేదు. మంగళవారం దాఖలైన నామినేషన్ల వివరాలిలా ఉన్నాయి.

 సత్తుపల్లి : బీఎస్‌పీ అభ్యర్థిగా దామళ్ల సత్యనారాయణ, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా అమర్లపూడి రాము, వీరెల్లి లజర్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా రెంటపల్లి కోటయ్యలు నామినేషన్లు వేశారు.

 కొత్తగూడెం : జైసమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా నరాల సత్యనారాయణ, లోక్‌సత్తా అభ్యర్థిగా కూడికల ఆంజనేయులు, స్వతంత్య్ర అభ్యర్థి గా గుగులోతు రాజేష్, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా జలగం వెంకటరావు, జనతా పార్టీ అభ్యర్థిగా పల్లి సురేష్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

 అశ్వారావుపేట: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున పోడియం కృష్ణ, స్వతంత్య్ర అభ్యర్థులుగా ఆంగోతు కృష్ణ, కారం భద్రమ్మ, కాంగాల మణమ్మ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా బాణోతు జాన్‌బాబులు నామినేషన్లు వేశారు.

 భద్రాచలం: పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా భూక్య పార్వతి, బీఎస్‌పీ అభ్యర్థిగా ఇర్ఫ కామరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఇస్లావత్ స్వరూప, మరం లక్ష్మీదే వి, ఇండియన్ నేషనల్  కాంగ్రెస్ అభ్యర్థిగా కుంజా ధర్మారావులు నామినేషన్లు వేశారు.

 ఇల్లందు : వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గుగులోతు రవిబాబు, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా చుంచు నాగేశ్వరరావు, స్వతంత్య్ర అభ్యర్థిగా మెసు రాజశేఖర్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా లావుడ్యా నాగేశ్వరరావులు నామినేషన్లు వేశారు.

 ఖమ్మం : స్వతంత్య్ర అభ్యర్థులుగా మడిశెట్టి యర్రప్ప, బత్తుల ప్రణీత్ చైతన్య, షేక్ మదార్‌సాహెబ్, బాణోతు మంగీలాల్ నాయక్, ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థిగా మహ్మద్ అసద్‌లు నామినేషన్లు వేశారు.

 పాలేరు: స్వతంత్య్ర అభ్యర్థిగా తిమ్మిడి సైదమ్మ, సీపీఎం నుంచి బత్తుల లెనిన్ నామినేషన్లు వేశారు.

 మధిర: స్వతంత్య్ర అభ్యర్థిగా బంక బాబురావు, ఎంఎస్‌పీ అభ్యర్థిగా యాతాకుల భాస్కర్, బీఎస్‌పీ అభ్యర్థిగా కర్రి కృష్ణ,  తెలంగాణ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మర్కపుడి రామదాసులు ఉన్నారు.

 నేడే చివరి రోజు...
 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ బీఫారం రాని అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.దశమి మంచిరోజు కావడంతోపాటు నామినేషన్ల ఘట్టం చివరి రోజు కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచేందుకు నామినేషన్లు వేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement