టీడీపీకి మహాలక్ష్మీ శ్రీనివాస్‌ రాజీనామా | Mahalakshmi srinivas quits TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి మహాలక్ష్మీ శ్రీనివాస్‌ రాజీనామా

Published Sat, Apr 26 2014 12:58 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

Mahalakshmi srinivas quits TDP

అనంతపురం: అనంతపురం జిల్లా అర్బన్ టీడీపీ ఇన్ఛార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం చేయలేదని, టీడీపీలో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. గత పదేళ్లుగా టీడీపీకి దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

సీఎం రమేష్ ఓ బ్రోకర్ అని.. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చారని మహాలక్ష్మి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పార్టీ టికెట్లు ఇప్పిస్తామంటూ భారీ ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారని గతంలో దీపక్‌రెడ్డి ఆరోపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement