మనీ.. మందూ..మార్బలం | Money .. mandu .. ships | Sakshi
Sakshi News home page

మనీ.. మందూ..మార్బలం

Published Tue, May 6 2014 12:17 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

మనీ.. మందూ..మార్బలం - Sakshi

మనీ.. మందూ..మార్బలం

  • అంతిమ ఘట్టంలో చివరి అస్త్రాలు తీస్తున్న టీడీపీ
  •  తెలుగు తమ్ముళ్ల దగుల్బాజీ వ్యూహాలు
  •  జోరుగా కల్తీ మద్యం పంపిణీ
  •  విశాఖ డెయిరీ పాత్రపై అనుమానాలు
  •  నోట్ల పంపిణీలోనూ వెన్నుపోటే
  •  సగానికి సగం నొక్కేస్తున్న నేతలు
  •  ముత్తంశెట్టి మనుషుల రంగ ప్రవేశం
  •  సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నోటు, నాటు, ఓటు... ఇదీ అనకాపల్లిలో టీడీపీ నేతల చివరి మజిలీ. అయితే అన్నిచోట్లా ఈ ఆఖరి అస్త్రం తిరగబడుతోంది. పీకలదాకా తాగించినా జనం ఛీ కొడుతున్నారు. ‘చంద్రబాబుకు ఓటెయ్యాలా? ఎందుకు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. నోట్ల కట్టలు పంచుతున్నా ఓటర్ల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ‘ఓటేస్తే మా బతుకులు తాకట్టు పెడతాడేమో’ అని సందేహిస్తున్నారు.

    ఒక్కరు కా దు, ఇద్దరు కాదు... వేల మంది అనకాపల్లిని అడ్డాగా చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, అనంతపురం జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే మకాం వేశారు. అనకాపల్లిలోని ఏ లాడ్జీకి వెళ్ళి నా తెలుగు తమ్ముళ్లే దర్శనమిస్తున్నారు. వీరిలో చాలామంది గంటా శ్రీనివాసరావు, ముత్తంశెట్టి మనుషులే. ఈ పార్లమెంట్ స్థానంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తెలియడంతో ఓట్ల బేరం మొదలు పెట్టారు.
     
    అంతా చీప్ లిక్కరే
     
    ఊళ్లల్లో చీప్ లిక్కర్ తాండవిస్తోంది. గంటా వారి సారా సామ్రాజ్యం నెల రోజుల క్రితమే దీన్ని దించినట్టు స్థానికులు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఆయన వర్గీయులదే సారా  వ్యాపారం కావడం, ముందుగానే సరిహద్దు రాష్ట్రాల నుంచి నకిలీ మద్యం తెప్పించుకున్నారు. చెరువుల్లో, బావుల్లో దాచిపెట్టిన పచ్చగ్యాంగ్ ఇప్పుడు దాన్ని జనం మీదకు వదులుతున్నారు. నిఘా వర్గాల కళ్లుగప్పి ఊళ్లల్లోకి తీసుకెళ్తున్నారు. మద్యం తాగిన అనేక మంది అస్వస్థతకు గురవుతున్నట్టు తెలుస్తోంది. చోడవరంలోని మూడు గ్రామాల్లో వాంతులు విరోచాలు అయినట్టు స్థానికులు చెబుతున్నారు. లేబుళ్లు లేని బాటిళ్లు పరిశీలించిన గ్రామస్తులు కల్తీ మద్యంగా చెబుతున్నారు. దీనివల్ల ప్రాణాలకు ప్రమాదమని వైద్యులంటున్నారు.
     
    చెప్పింది వెయ్యి... ఇచ్చింది సగమే

     
    కశింకోట, రాంబిల్లి మండలాల్లో ఓటర్లకు వింత అనుభవం ఎదువుతోంది. మూడు రోజుల క్రితం టీడీపీ శ్రేణులు ఓటుకు వెయ్యి ఇస్తామని ప్రకటించారు. తీరా పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో దాన్ని రూ. 500 చేతుల్లో పెడుతున్నారు. రాంబిల్లి మండంలోని కొన్ని గ్రామాల్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. స్థానిక టీడీపీ శ్రేణులే సగం నొక్కేసినట్టు తేలడంతో ఆ పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు. డబ్బులు తీసుకున్నా, తగిన బుద్ది చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా టీడీపీ నాయకత్వం మండల నేతలపై ఆగ్రహించినట్టు తెలిసింది.
         
    పాయకరావుపేట, యలమంచలి నియోజవర్గాల్లో విశాఖ డెయిరీ వాహనాల ద్వారా డబ్బు సంచులు వెళ్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వాహనాలను పోలీసులు ఏమాత్రం తనిఖీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ డెయిరీ ఓ టీడీపీ నేత గుప్పిట్లో ఉండటం, ఆయన ఆదేశాల మేరకు ఉద్యోగులే స్వయంగా డబ్బు పంపిణీకి ఉపక్రమించడం పలుచోట్ల వివాదాస్పదమవుతోంది.
         
    ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా లావాదేవీలు జరుగుతున్న వైనం కూడా సందేహాలు రేపుతోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆ వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు సమాచారం.
         
    హవాలా గ్యాంగ్ కూడా రంగ ప్రవేశం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి కొరియర్స్ ఇక్కడకు రావడం, కేవలం టీడీపీ డబ్బును గ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేయడం స్థానికులను ఆశ్చర్య పరుస్తోంది.
     
    అవి నిజమైన నోట్లేనా?
     
    అనకాపల్లి ప్రజలకు ఈ సందేహాలు వస్తున్నాయి. రిక్షా కార్మికులకు, మురికివాడల్లో ఉన్న వారికి టీడీపీ కార్యకర్తలు రాత్రికిరాత్రి రూ. 500 కొత్త నోట్లు ఇచ్చినట్టు తెలిసింది. ఇందులో కొన్ని నకిలీ  నోట్లని తేలింది. దీంతో ఆగ్రహించిన వారు టీడీపీ శ్రేణులను నిలదీశారు. విషయం బయటకు పొక్కకుండా వాటికి బదులు మరొకటి ఇచ్చినట్టు తెలిసింది. అయితే నియోజకవర్గంలో పంచిన ఈ నోట్లన్నీ నిజమైనవేనా? లేకపోతే నకిలీ నోట్లు పంచుతున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇలాంటి సంఘటనే అచ్యుతాపురంలోనూ ఎదురైంది.
     
    నొక్కేద్దాం బాసూ!
     
    ‘జనం డబ్బులిచ్చినా ఓట్లేసేట్టు లేరు. ఓడిపోయే పార్టీ రేపు మనకు నయా పైసా ఇవ్వదు. ఇదే అదను నొక్కేద్దామా?’ డబ్బు పంపిణీలో టీడీపీ నేతల ముచ్చట్లు ఇవి. స్థానిక నాయకత్వంపై నమ్మకం కుదరని ముత్తంశెట్టి వర్గీయులు మండలానికో త్రిసభ్య కమిటీ వేసుకున్నారు. వారి ఆధ్వర్యంలోనే డబ్బు పంపకం జరపాలని నిర్ణయించుకున్నారు. భుజాలరిగేలా జెండా మోసినా గుర్తింపు ఇవ్వడం లేదని భావించిన మండలస్థాయి నేతలు వచ్చిన డబ్బును నొక్కేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి.
     
    అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్లు
     
    అనకాపల్లి: తెలుగు తమ్ముళ్లు అడ్డంగా దొరికారు. డబ్బుతో ఓటర్లను మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పట్టణంలోని గవరపాలెంలో ఉన్న దాసరిగెడ్డ సమీపంలో సోమవారం సాయంత్రం రూ.50వేల నగదుతో ఉన్న తెలుగుతమ్ముళ్లను ఎన్నికల నిఘా అధికారులు వల వేసి పట్టుకున్నారు. నగదు ఉన్న వ్యక్తి నుంచి వివరాలను రాతపూర్వకంగా తీసుకున్నారు. ఈ వివరాలతో కూడిన నివేదికను ఆర్డీవోకు అందిస్తామని అధికారులు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement