కామారెడ్డి, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికలలో పోలైన ఓట్లు 2,39,486 కాగా పోటీలో నిల్చున్న అభ్యర్థులు వాటి కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 50 కోట్లుగా అంచనా. పురపోరులో విచ్చలవిడి ఖర్చు మూలంగా ఒక్కో ఓటుకు రూ. 2 వేలకు పైగా అభ్యర్థు లు వెచ్చించినట్లు తె లుస్తోంది. ఎన్నికల ఖర్చు విషయంలో ఎ లక్షన్ కమిషన్ ఎన్ని నిబంధనలు పెట్టినా, అభ్యర్థులు మాత్రం డబ్బు ప్రవాహాన్ని పారించారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధ న్, ఆర్మూర్ మున్సిపాలిటీలకు గత నెల 30న ఎన్నికలు
జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే ఆశావహులు ప్రలోభాలకు తెరలేపారు.
అడ్డగోలుగా
బరిలో నిలిచినవారు పెట్టిన ఖర్చు అడ్డగోలుగా ఉన్నట్టు తెలుస్తోంది. కామారెడ్డి పట్టణంలో 33 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ప్రతి వార్డులో కనీసం ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది పోటీలో నిల్చున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పని చేశారు. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు గరిష్టంగా రూ. 20 లక్షలు, మరి కొంత మంది తక్కువలో తక్కువ రూ. 5 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పట్టణంలోని 33 వార్డులలో అభ్యర్థులంతా కలిసి చేసిన ఖర్చు రూ. 10 కోట్లకు పై మాటే అంటున్నారు. కామారెడ్డిలో 39,832 మంది మాత్రమే ఓటు వేశారు. ఇక్కడ ఒక్కో ఓటుకు రూ. రెండు వేలకు పైచిలుకు ఖర్చు చేసినట్లు అంచనా.
నగరం... గరం గరం
నిజామాబాద్ నగరంలో 50 డివిజన్లకు ఎన్నికలు జరుగగా 1,32,617 మం ది ఓటు వేశారు. అక్కడ అభ్యర్థులు చేసిన ఖర్చు రూ. 20 కోట్లకు పైగా ఉం దని తెలుస్తోం ది. ఆర్మూర్‌లో 26,246 మంది ఓటు హక్కు వినియోగించుకోగా అక్కడ రూ. 10 కోట్లకు పైగా ఖర్చయ్యింది. బోధన్ పట్టణంలో 40,791 మంది ఓటు వేయగా అక్కడ కూడా రూ. 10 కోట్లకు పైగా ఖర్చు చేశారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఖర్చులో ఎక్కువ శాతం ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందే జరిగింది. అంతకుముందు కేవలం ఓట ర్లకు మద్యం తాగించడం, ఇతర ఖర్చులు మాత్రమే అయ్యాయి. అయితే అధిక ఖర్చు కేవలం ఓటర్లను ప్రలోభపెట్టడానికే అయినట్టు తెలుస్తోంది.
ఓటుకు వెయ్యి!
పోటీ తీవ్రంగా ఉండి ప్రతిష్టాత్మకంగా మారిన కొన్ని వార్డులలో ఓటర్లకు నేరుగా ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు అందజేశారని సమాచార. మరికొన్ని చోట్ల వెండి నాణేలు, కుక్కర్లు, ఇతర సామగ్రి పంపిణీ చేశారు. పలుకుబడి ఉన్న వారు నివసించే కాలనీలలో అయితే విలువైన మద్యం బాటిళ్లను సరఫరా చేశారు. ము రికివాడలు, ఇతర వార్డులలో మహిళలకు చీరెలు, ఇతర సామగ్రిని పంచారు. అభ్యర్థులు గెలుపో.. ఓటమో తేల్చుకునేందుకు సిద్ధమై డబ్బును వెదజల్లినట్లు ఆయా పా ర్టీల కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారు.తాము పెట్టిన ఖర్చు ఎంత? ఎన్ని ఓట్లు వస్తాయి? అంచనాల్లో మునిగి పోయారు.
అమలు కాని ఎన్నికల నియమావళి
ఎన్నికల కమిషన్ నిర్దేశాల ప్రకారం మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు రూ. 1 లక్షకు మించి ఉండరాదు. అది కూడా బ్యాంక్ అకౌంట్ తెరిచి లావాదేవీ లు జరపాలి. అయితే ఏ ఒక్కచోట కూడా ఆ నిబంధనలు అమలు కాలేదు. అభ్యర్థులు పోటీపడి డబ్బును నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. ఎన్నికల నియమావళి అమలు కావడం లేదని తెలిసినా అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. నిబంధనలతో అయ్యేదేమి లేదన్న రీతిలో అభ్యర్థులు ఖర్చు పెట్టారు.
ఏరులుగా పారి
Published Wed, Apr 2 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
Advertisement
Advertisement