మున్నేరు ‘ముంపు’ సమస్య పరిష్కరిస్తా
- వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శీనన్న
- ఖమ్మంలో వైఎస్సార్‌సీపీ - సీపీఎం మహాప్రదర్శన
- వేలాది మందితో రోజంతా సాగిన ర్యాలీ
- అడుగడుగునా నీరాజనం
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: ఖమ్మంనగరంలో మున్నేరు ముంపు బాధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని, కాంక్రీట్ గోడ నిర్మిస్తానని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలో త్రీటౌన్‌లో వైఎస్సార్‌సీపీ - సీపీఎం ఆధ్వర్యంలో మహాప్రదర్శన నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం ఆధ్వర్యంలో ప్రకాష్‌నగర్ లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది.
అక్కడి నుంచి శ్రీకృష్ణ మందిరం, పెట్రోల్‌బంక్, శ్రీనివాసనగర్, అయ్యప్ప గుడి, బంజారా కాలనీ, మాంట్‌ఫోర్ట్ పాఠశాల, బోస్‌సెంటర్, గ్రెయిన్ మార్కెట్ రోడ్, సుందరయ్యనగర్, పంపింగ్‌వెల్ రోడ్, మార్కెట్ రోడ్, జహీర్‌పుర, వాసవీ గార్డెన్, శ్రీవాసవి ఫంక్షన్‌హాల్, బురదరాఘవాపురం, మోతీనగర్, మంచికంటినగర్, వెంకటేశ్వరనగర్, బీరప్ప గుడి, లారీ ఆఫీస్, సారధినగర్, జూబ్లీపుర, బొక్కలగడ్డ వరకు వరకు సాగింది.ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన ఈ యాత్రకు దారి పొడవునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ర్యాలీ ముగింపు సందర్భంగా బొక్కలగడ్డలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇప్పిస్తానని అన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి రాజన్న చూపిన మార్గంలో జగనన్న ఆధ్వర్యంలో కృషి చేస్తానని అన్నారు.
అనంతరం కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా నాయకురాలు అఫ్రోజ్ సమీనా, డివిజన్ కార్యదర్శి ఎర్ర శ్రీకాంత్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు తోట రామారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు, ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలు షర్మిలాసంపత్, సీపీఎం డివిజన్ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, ఎర్ర గోపి, ఎస్‌కే సైదులు, కొప్పుల రాములు, బండారి యాకయ్య, మద్దె సత్యం, రామారావు, వైఎస్సార్‌సీపీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మా అప్పిరెడ్డి, ఈర్ల ప్రసాద్, తిరుపాల్‌యాదవ్, పుచ్చకాయల వీరభద్రం, బాణాల లక్ష్మణ్, ఆరెంపుల వీరభద్రం, నారుమళ్ల వెంకన్న, కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, షకీనా, జిల్లేపల్లి సైదులు, ప్రభావతి, జంగాల శ్రీను, ఉపేంద్రరెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాసనగర్ ప్రాంతంలో పొంగులేటి శీనన్న ఎమ్మెల్యే అభ్యర్థి కూరాకుల నాగభూషణాన్ని రిక్షా ఎక్కించుకుని తొక్కడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ ర్యాలీకి అడుగడుగునా ప్రజలు నిరాజనం పట్టారు. ఆద్యంతం వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బొక్కలగడ్డ ప్రాంతంలో పొంగులేటి శీనన్నపై అభిమానులు భారీగా పూలవర్షం కురిపించారు.
బీసీ సంక్షేమ సంఘం మద్దతు..
వైఎస్సార్‌సీపీ - సీపీఎం ర్యాలీకి బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పిండిప్రోలు రామ్మూర్తి, యువజనసంఘం జిల్లా అధ్యక్షుడు మోడేపల్లి కృష్ణమాచారి పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కూరాకుల నాగభూషణంను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓర్సు శ్రీనివాస్, జిల్లా ప్రచార కార్యదర్శి దార్న మహేష్, కోశాధికారి రాపోలు రాంబాబు, నాయకులు సంపసాల వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రమణ, రామ్మూర్తి పాల్గొన్నారు.