బాబు తరఫున లోకేష్ నామినేషన్
కోడ్ ఉల్లంఘించిన తమ్ముళ్లు
కుప్పం, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుుడు తరఫున ఆయన తనయుుడు లోకేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయుం 11.30 గంటలకు చీవునాయునపల్లె వరదరాజస్వామి ఆలయుంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుడి, బడి అనే తేడా లేకుండా తెలుగుదేశం పార్టీ జెండాలను ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు.
పోలీసుల సాక్షిగా చీవునాయునపల్లె వరదరాజస్వామి దేవాలయూన్ని పార్టీ జెండాలతో పసుపువుయుం చేసి అధినేత కుమారుడికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో లోకేష్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో స్వయంగా నామినేషన్ వేయలేని కారణంగా చంద్రబాబు గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టులో అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.ఉషాకిరణ్ ఎదుట ప్రమాణపత్రం చదివారు.