ఒత్తిడి పెంచుతున్న నాయకులు
సమాధానం చెప్పలేం మొహం చాటేస్తున్న లోకేష్
టీడీపీలో నంబర్ టూ స్థానంలో ఉన్నానని భావిస్తున్న లోకేష్ కొన్ని సందర్భాల్లో పార్టీని తానే సొంతంగా లీడ్ చేయాలని ఆశిస్తుంటారు. పార్టీ విధానపరమైన నిర్ణయాల్లోనూ కొన్ని సార్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. చాలా సందర్భాల్లో అవి ఎదురుతంతున్నప్పటికీ తీరు మార్చుకొని లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేస్తూ తండ్రిని ఇరకడంలో పెడుతున్నారు. జనసేనతో అధికార పంపిణీ విషయంలో అయన చేసిన కామెంట్స్ జనసైనికుల్లో అగ్రహాన్ని లేపాయి. అసలు అలాంటి ఆలోచనే లేదని, కూటమి సీఎంగా చంద్రబాబే ఉంటారని తేల్చేసారు. దానికి తోడు యువగళం పాదయాత్రలో తనలో పోరాట పటిమ, పరిణితి బాగా పెరిగిందని భావిస్తున్న లోకేష్ ఇప్పటికే తండ్రిని ఓవర్ టేక్ చేసి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో చిక్కులు తెస్తున్నట్లు పెద్దలు గుర్తించారు.
వాస్తవానికి ఆమధ్య పాదయాత్రలో భాగంగా లోకేష్ చాలాచోట్ల బహిరంగసభల్లో మాట్లాడారు. ఆ సందర్భంగా కొందరు నాయకులను అక్కడికక్కడే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేసారు. అయితే అయన ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ప్రకటించుకుంటూ వెళ్లడంతో చంద్రబాబు ఆగ్రహించి ఇకముందు అలా చేయొద్దని హెచ్చరించడంతో ఆ తరువాత అయన అభ్యర్థుల ప్రకటనను ఆపేసారు. కానీ తనలోని పెద్దరికపు కోరికను చంపుకోలేని లోకేష్ దాదాపు నలభై మంది వరకు ఆశావహుల దగ్గర టిక్కెట్లు ఆశచూపి డబ్బులు తీసుకున్నారని అంటున్నారు. గుంటూరు, కృష్ణ, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువమంది లోకేష్ కు దాదాపు ఐదేసి కోట్లవరకు డబ్బులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వారికి టిక్కెట్ దక్కుతుందా లేదా అన్నది ప్రశ్నర్థకంగా మరేంది.
గుంటూరు జిల్లాలో ఓ విద్యాసంస్థకు చెందిన యజమాని దగ్గర దాదాపు ఐదు కోట్లు తీసుకున్నారని తెలిసింది. ఐతే ఇప్పుడు అయన టిక్కెట్ వెనుకబడినట్లు చెబుతున్నారు. లోకేష్ హామీ ఇచ్చినావాళ్ళకు ప్రజాదరణ లేదని సర్వేల్లో తేలిందని, అందుకే వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేసారని అంటున్నారు. అనంతపురంలో ఓ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి దగ్గర కూడా ఇలాగే కొంత డబ్బు తీసుకుని లోకేష్ హామీ ఇచ్చినా అక్కడ ఐవీఆర్‌ఎస్ ద్వారా మళ్ళీ సర్వే చేస్తున్నారు.
అందులోకానీ సదరు నాయకుడికి మంచి మార్కులు రాకపోతే టిక్కెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పేశారట. విశాఖ నుంచి కూడా ఇలాగే కొందరికి హామీ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారో తెలియడం లేదని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామని, ఎమ్మెల్సీలు ఇస్తామని లోకేష్ నచ్చజెబుతున్నట్లు అంటున్నారు. కానీ ఆ మాటలు నమ్మేలా లేవని, అనవసరంగా డబ్బులిచ్చి ఇరుక్కున్నామని వారు వాపోతున్నారు. మొత్తానికి చినబాబు లోకేష్ జోక్యం పార్టీకి పెద్ద తలనొప్పులు తెచ్చిందని అంటున్నారు.
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment