* వైఎస్ ఐదేళ్ల పాలన.. సంక్షేమ పాలనకు ఏకైక చిరునామా
* అంతకుముందు, ఆ తర్వాత అందరి హయాంలోనూ అస్థిరతే
* ఆటలో అరటిపళ్ల చందంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు
* చీటికీమాటికీ ఇష్టానుసారం మార్చేస్తూ వచ్చిన అధిష్టానం
* వెన్నుపోట్ల బాధితునిగా మిగిలిపోయిన అన్నగారు ఎన్టీఆర్
* అస్థిరతకు, జనాందోళనలకు మారుపేరుగా బాబు హయాం
మేడికొండ కోటిరెడ్డి, హైదరాబాద్: ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యమని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నిత్యం చెప్పేవారు. ఈ సూత్రం పాలనకు కూడా వర్తిస్తుంది. ప్రజా క్షేమాన్ని పట్టించుకోని పాలకులతో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. పెపైచ్చు అలాంటి వాళ్లు ఎంతకాలం అధికారంలో కొనసాగితే అంత అరిష్టం. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన వ్యక్తి జమానాలో జరిగిన వినాశనమే ఇందుకు తిరుగులేని రుజువు. అధికారంలో ఉన్నంత కాలం ఎలా పాలించాడన్నదే ఒక నాయకుని సమర్థతకు ప్రమాణం. దాదాపు 60 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో ముఖ్యమంత్రులుగా కొనసాగిన వారందరినీ ఈ గీటురాయిపై పరీక్షించి చూస్తే మిగతా వారెవరికీ అందనంత ఎత్తున కనిపించే ఏకైక నాయకుడు... వైఎస్ రాజశేఖరరెడ్డి. సుస్థిర పాలనకు, సమగ్రాభివృద్ధికి, సర్వ జన సంక్షేమానికి మారుపేరుగా సాగిన వైఎస్ ఐదేళ్ల పాలన ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఓ చిరస్మరణీయ ఘట్టం.
బలమైన నాయకుడంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపించిన వైఎస్‌కు ముందు గానీ, తర్వాత గానీ రాష్ట్రంలో పాలన నిత్యం అస్థిరతల మధ్యే సాగింది. ఏ ముఖ్యమంత్రీ ప్రజలకు సుస్థిర పాలన అందించలేకపోయారు. హస్తిన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నాటకంలో శ్రీకృష్ణుని పాత్రధారుల్లా ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిపోవడానికే పరిమితమైన చరిత్ర కాంగ్రెస్ సీఎంలది. ఎన్టీఆర్‌దేమో సొంత మంత్రి నుంచే తిరుగుబాటును, నమ్మి నెత్తిన పెట్టుకున్న జామాత చేతిలో వెన్నుపోటును చవిచూసిన విషాదం. ఇక చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనైతే రాష్ట్రంలో నిత్య అస్థిరతకు, ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, నేతల్లో నక్సల్స్ భయాలకు మారుపేరుగా మిగిలిపోయింది...
తెలుగు ప్రజల తీర్పు ఎప్పుడూ విస్పష్టమే. దాదాపు 60 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వారు ప్రతిసారీ ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. కానీ ఒక్క వైఎస్‌ను మినహాయిస్తే గద్దెనెక్కిన ఏ పాలకుడూ వారి నమ్మకాన్ని నిలుపుకోలేదు. రాష్ట్ర శాసనసభకు 12సార్లు ఎన్నికలు జరిగితే ఏకంగా 16 మంది సీఎంలు కావడమే ఇందుకు నిదర్శనం. పైగా వీరిలో ఎనిమిది మంది ఏకంగా రెండు, మూడు విడతలు ముఖ్యమంత్రులయ్యారు. వీరిలో వైఎస్ మినహా మిగతా 15 మందిదీ అస్థిర, అస్తవ్యస్త పాలనే.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే పార్టీలో అసమ్మతులే: కాంగ్రెస్ అధిష్టానం దశాబ్దాల తరబడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చీటికీమాటికీ మారుస్తూ వచ్చింది. ఒక్క వైఎస్ తప్ప రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఐదేళ్ల పాటు పూర్తిగా అధికారంలో ఉండలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! విధేయుల్లో ఒకరిని సీఎం చేయడం, వారు బలపడకుండా అసమ్మతిని ఎగదోయడం అధిష్టానానికి పరిపాటిగా మారింది. 1956లో తొలి సీఎం అయిన నీలం సంజీవరెడ్డి 1960 జనవరిలో రాజీనావూ చేసి ఏఐసీసీ అధ్యక్షుడయ్యారు.
ఆయున స్థానంలో వచ్చిన దామోదరం సంజీవయ్యుకు కూడా పూర్తి కాలం పదవిలో ఉండేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ అవకాశం ఇవ్వలేదు. ఆయనను కాంగ్రెస్ అధ్యక్షున్ని చేసి, నీలంను వురోసారి వుుఖ్యవుంత్రిగా పంపారు. కానీ ఆయన వుూడోసారి కూడా పూర్తి కాలం పదవిలో ఉండలేదు. రాయులసీవు బస్సు రూట్ల జాతీయీకరణ కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల కారణంగా నీలం 1964 ఫిబ్రవరిలో రాజీనావూ చేయంతో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎం అయ్యారు. కానీ తెలంగాణ ప్రజాసమితి నేత వుర్రి చెన్నారెడ్డితో చేసుకున్న ఒప్పందంలో భాగంగా కాసుతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజీనామా చేయించారు.
అలా 1971 సెప్టెంబర్‌లో తొలి తెలంగాణ సీఎంగా పీవీ నరసింహారావు పదవి చేపట్టినా ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా మొదలైన జై ఆంధ్ర ఉద్యవుంలో చెలరేగిన హింస, అస్థిరత వల్ల ఏడాదిన్నరకే రాజీనావూ చేశారు. తర్వాత వచ్చిన జలగం వెంగళరావు కూడా ఐదేళ్లు పదవిలో లేరు. ఇక 1978 ఎన్నికల తర్వాతైతే ఇందిర హయూంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో వుుఠాతత్వం, అసవ్ముతి ఫలితంగా తారస్థాయికి చేరాయి. దాంతో ఐదేళ్లలోనే ఏకంగా నలుగురు సీఎంలు మారారు. మొదట మర్రి, తర్వాత వరుసగా టంగుటూరి అంజయ్యు, భవనం వెంకట్రాంరెడ్డి, కోట్ల విజయుభాస్కర్‌రెడ్డి పగా ్గలు చేపట్టారు. 1989లో సీఎం అయిన వుర్రి ఏడాది లోపే దిగి పోవాల్సి వచ్చింది. 1990 డిసెంబర్‌లో నేదురువుల్లి జనార్దనరెడ్డి సీఎం అయ్యారు. కోర్టు వ్యాఖ్యల ఫలితంగా 1992లోనే ఆయనా దిగిపోయారు. తర్వాత కోట్ల వచ్చారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత 2009-2014 మధ్యలో రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి రూపంలో ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల తో పాటు రాష్ట్రపతి పాలన చోటు చేసుకున్నాయి.
ఎన్టీఆర్‌కు రెండు వెన్నుపోట్లు
కాంగ్రెస్ అస్థిర రాజకీయాలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామా రావుకు ప్రజలు మూడుసార్లు అధికారం ఇచ్చారు. 1983లో ఆయన తొలిసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిస్తే, కొద్దికాలానికే మంత్రివర్గంలోని నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసి సీఎం అయ్యారు. నెల రోజుల రాజకీయ ఉద్యమం తర్వాత ఎన్టీఆర్ తిరిగి సీఎం అయ్యారు. 1994లో ఎన్టీఆర్ భారీ మెజారిటీతో మూడోసారి సీఎం అయినా, ఏడాదిలోపే అల్లుడు చంద్రబాబు వెన్నుపోటుతో మరోసారి పదవి కోల్పోయారు. బాబు హయాంలో రాష్ట్రంలో నక్సల్స్ సమస్య తీవ్రతరమైంది. చాలాచోట్ల ప్రజాప్రతినిధులు తమ సొంత నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది.
స్వయంగా చంద్రబాబే నక్సల్ దాడికి గురై, ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. సానుభూతి ఓట్లు రాకపోతాయా అన్న ఆశతో పది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి భంగపడ్డారు. అఖండ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్ 2004-2009 మధ్య కాలంలో రాష్ట్ర ప్రజలకు పూర్తి భిన్నమైన పాలన అందించి చూపించారు. ఆ ఐదేళ్లూ రాష్ట్రంపై ఢిల్లీ పెత్తనం లేదు. పాలనపరమైన సంక్షోభమన్నదే లేకుండా కొనసాగింది. అసలు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఆ ఐదేళ్ల కాలంలో ఎలాంటి ఉద్యమాలూ చేయలేదంటే వైఎస్ పాలన ఎంత ఆదర్శంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఒక శాసనసభ పదవీకాలంలో ఐదేళ్లూ సీఎంగా ఉన్న ఖ్యాతి ఒక్క వైఎస్‌కు మినహా ఎవరికీ దక్కలేదు.
సుస్థిరతకు.. సుపరిపాలనకు.. అతనొక్కడే
Published Tue, Mar 25 2014 1:56 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement
Advertisement