కౌంటింగ్‌కు సహకరించాలి
కొణిజర్ల, న్యూస్‌లైన్: ఈ నెల 16న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఐ. శ్రీనివాసశ్రీనరేష్ కోరారు. మండలంలోని తనికెళ్ల వద్ద ఉన్న విజయ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని వర్గాల వారి సహకారంతో జిల్లాలో ఏ ఆటంకం లేకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించగలిగామన్నారు. జిల్లావ్యాప్తంగా 80 శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ సంఖ్య ఇంకా లెక్కించవలసి ఉందన్నారు. అనుకున్న లక్ష్యం 90 శాతం పోలింగ్‌కు చేరుకోలేకపోయినా తెలంగాణలో పోలింగ్ శా తంలో జిల్లా రెండోస్థానంలో ఉందన్నారు. పార్లమెంట్‌కు 83 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా శ్రమిం చిన ప్రతి అధికారిని ఆయన అభినందించారు.
స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలన
మధిర, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ సందర్శించారు. ఈవీఎంలు ఉంచిన తీరును పరిశీలించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేయించారు. అనంతరం అసెంబ్లీ నియోజకవ ర్గాలలో పోలింగ్ కేంద్రాల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల వివరాలు పరిశీలించారు. ప్రజా ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మధిర నియోజకవర్గం అయ్యవారిగూడెంలో ఏ గుర్తుకు నొక్కినా ఓటు కంకి కొడవలికే పడ్డాయని, పార్లమెంట్‌కు సంబంధించి 106 ఓట్లు ఆ విధంగా పడ్డాయని దీనిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఎం.నిరంజన్‌రెడ్డి కలెక్టర్‌కు తెలిపారు.
ఖమ్మం గ్రెయిన్ మార్కెట్‌నుంచి పోలింగ్ స్టేషన్ ఎత్తి వేయాలని అక్కడ దుమ్ము , మిర్చి ఘాటుకు తట్టుకోలేక ప్రజలు ఓటేయడానికి రావడం లేదని, దీని వల్ల పోలింగ్ శాతం పడి పోతుందని టీఆర్‌ఎస్ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సాధారణ పరిశీలకుడు జశ్వంత్ సింగ్, పాలేరు, ఖమ్మం, మధిర అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకుడు ఆశీష్‌కుమార్ ఘోష్, వైరా, సత్తుపల్లి,కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ పరిశీలకుడు గోబింద చంద్ర సేతి, ఐటీడీఏ పీఓ దివ్య, డీఆర్‌ఓ శివశ్రీనివాస్, రిటర్నింగ్ అధికార్లు అమయ్‌కుమార్, దాసరి సంజీవరెడ్డి, వెంకటాచారి, వైరా , కొణిజర్ల,చింతకాని, నేలకొండపల్లి తహశీల్దార్‌లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.