
అన్న కోసం ప్రియాంక ప్రచారం
అమేథి: లోక్సభ ఎన్నికలలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విజయం కోసం ఆయన సోదరి ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేథి సిట్టింగ్ ఎంపీ రాహుల్ను గెలిపించాలని కోరుతూ ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు నియోజవర్గంలో ప్రియాంక పర్యటించనున్నారు. అమేథి నియోజవర్గం ఇంచార్జి చంద్రకాంత్ దూబె ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రియాంక బహిరంగ సభల్లో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అమేథి నుంచి బీజేపీ తరపున ప్రముఖ టీవీ నటి స్మృతి ఇరాని, ఆప్ తరపున కుమార్ విశ్వాస్ పోటీ చేస్తున్నారు. కాగా సమాజ్ వాదీ పార్టీ రాహుల్పై పోటీకి అభ్యర్థిని నిలబెట్టలేదు.