బాబు+రామోజీ= 1000 అబద్ధాలు
* ఎన్నికలు వచ్చినప్పుడల్లా రామోజీకి టీడీపీ పూనకం
* బాబును గద్దెనెక్కించడమే ఏకైక లక్ష్యంగా రాతలు
* ‘ఈనాడు’ నైజానికి అద్దం పట్టిన 2004, 2009 ఎన్నికలు
* గెలుపు టీడీపీదేనంటూ గుడ్డి రాతలు.. వైఎస్‌పై విషం
* ప్రజాభిప్రాయూన్నీ తానే నిర్దేశించాలనే నియుంత నైజం
* ఎన్నికల వేళ మరోసారి పదునెక్కుతున్న ‘పచ్చ’ రాతలు
ఎలక్షన్ సెల్: పున్నమికి, అమావాస్యకు కొందరికి పిచ్చి ప్రకోపిస్తుంటుంది. ఎన్నికల వేళ ‘ఈనాడు’ రామోజీరావు కూడా రాత్రింబవళ్లూ అచ్చంగా అటువంటి మానసిక స్థితిలోనే మునిగి తేలుతుంటారు. ఎక్కడ లేని ఉన్మాదమూ ఆయనను ఆపాదమస్తకం ఆవహిస్తుంటుంది. ప్రచార వేడితో పాటే అది కాస్తా పెరిగి పరాకాష్టకు చేరుతుంది. ఇక పోలింగ్ తేదీకల్లా రాజగురువు ముసుగు కొద్ది కొద్దిగా తొలగిపోయి, ఆయన లోపలి బాబు అన్ని ముసు గులూ తొలగించుకుని రెండు వేళ్ల చిహ్నం చూపుతూ బయటికొచ్చేస్తాడు. తన తాబే దారు బాబుకు అధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా తన పత్రికకు పూర్తిగా పసుపు రంగు పులిమి ప్రజల మీదికి వదులుతుంటారు రామోజీ. పతాక శీర్షిక నుంచి మొదలు పెట్టి ప్రతి పేజీలోనూ టీడీపీని, చంద్రబాబును ఆకాశానికెత్తడం, ఇతరులను వీలైనంతగా అణగదొక్కడమే ‘ఈనాడు’కు సింగిల్ పాయింట్ అజెండాగా మారిపోతుంది.
వైఎస్‌పై, ఆయన వారసునిపై పేజీల నిండా విషం కక్కుతూ రామోజీ విషపుత్రిక పేట్రేగిపోతుంది. నగరానికి దూరంగా కట్టుకున్న కోటలో జనానికి సుదూరంగా బతుకుతూ కూడా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని తానే నిర్దేశించాలన్న రామోజీ తాపత్రయం దాని రాతల్లో అడుగడుగునా ప్రతి ఫలిస్తుంటుంది. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలు ఈ ధోరణికి తిరుగులేని సాక్షిగా నిలిచాయి. ఆ రెండు దఫాలూ ప్రజలు టీడీపీకి కర్రుగాల్చి వాత పెట్టినా, తద్వారా రామోజీ రోత రాతలనూ నిర్ద్వంద్వంగా తిరస్కరిం చినా ‘ఈనాడు’ తీరు ఏ మాత్రమూ మారలేదు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో మరోసారి ‘పచ్చ’ రాతలకు పదును పెడుతోంది. తన టీడీపీ పక్షపాతాన్ని పేజీ పేజీలోనూ నిస్సిగ్గుగా ప్రదర్శించుకుంటోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అక్షరాలా విషం చిమ్ముతూ పాత తరహా కుహకానికి మరోసారి సరికొత్తగా తెర తీస్తోంది. కుక్క తోక ఎప్పుడూ వంకరేనని ఇంకోసారి రుజువు చేస్తోంది...
2004లో నిస్సిగ్గుగా ‘చంద్రహాసం’
2004 ఎన్నికల సందర్భంగా రాష్ట్రమంతటా కాంగ్రెస్ హవా కొట్టొచ్చినట్టు కన్పించింది. వైఎస్ సారథ్యంలో ఘన విజయం ఖాయమని సర్వేలు, ఎన్డీటీవీ వంటి జాతీయ మీడియా సంస్థలు ముక్త కంఠంతో చెప్పాయి. అయినా సరే... జనం నాడిని ఇట్టే పట్టేస్తానని గొప్పలు చెప్పుకునే రామోజీకి మాత్రం అవేవీ ‘కన్పించలేదు’. బాబు తొమ్మిదేళ్ల పాలనకు ప్రజలు చరమ గీతం పాడనున్న వైనం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నా ‘ఈనాడు’ మాత్రం కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి కూడా సిగ్గు పడేలా ప్రవర్తించింది. బాబుకే మళ్లీ అధికారమంటూ ఉన్మాదంతో ఊగిపోయింది. ఊరూపేరూ లేని తాబేదారు సంస్థలతో సర్వేలు చేయించి, వాటి ఫలితాలను సరిగ్గా తొలి, మలి దశ పోలింగ్ వేళల్లో పతాక కథనాలుగా వండి వార్చింది. ‘బాబుకే మళ్లీ అధికారం’ అంటూ తొలి దశకు ముందు, ‘తెలుగుదేశానికే మళ్లీ పగ్గాలు’ అంటూ మలి దశ సందర్భంగా ఊదరగొట్టింది. ‘ఇంకేముంది... టీడీపీయే దుమ్ము రేపనుంది’ అంటూ పేట్రేగిపోయింది.
వీటన్నింటినీ మించి... కౌంటింగ్ కూడా జరగకముందే, టీడీపీ గెలిచేసిందంటూ ముందస్తుగానే ఏకంగా ప్రత్యేక సంచికను ముద్రించిందంటే అప్పట్లో రామోజీ పైత్యం ఎంతగా ముదిరిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ‘చంద్రహాసం’ పేరుతో ఎనిమిది పేజీల ప్రత్యేక అనుబంధాన్నే సిద్ధం చేసి పెట్టుకుంది ‘ఈనాడు’. నిజానికి రాష్ట్రమంతటా హస్తం హవా వీస్తోందని, తానెంతగా తిమ్మిని బమ్మి చేయజూసినా చంద్రబాబు గెలుపు ముఖం చూసే సమస్యే లేదని రామోజీకి బాగా తెలుసు. ఆ ఫలితాలు వెల్లడైన రోజు ఎటూ అవకాశముండదు గనుక ముందుగానే ‘డమ్మీ’ పేజీలు వేసుకుని మిథ్యానందం పొందారు రాజగురువు! తీరా వైఎస్ మ్యాజిక్ ముందు బాబు బోల్తా పడి, టీడీపీ మట్టికరవడంతో ‘చంద్రహాసం’ చెత్తనంతా వుూటకట్టి దాచేసి, చేసి తేలు కుట్టిన దొంగలా గప్‌చుప్ అయిపోయారు.
2004 ఎన్నికల సందర్భంగా సర్వేల సాకుతో ‘ఈనాడు’ వేసిన ‘పచ్చ’ వేషాలకు ఈ క్లిప్పింగులు వురో నిదర్శనం. ఊరూ పేరూ లేని సర్వేలను ఉటంకిస్తూ, ‘బాబుకే వుళ్లీ అధికారం’, ‘తెలుగుదేశానికే వుళ్లీ పగ్గాలు’, ‘తదుపరి వుుఖ్యవుంత్రిగా చంద్రబాబే ఉండాలని ఏకంగా 62 శాతం వుంది భావిస్తున్నారు’ అంటూ గాలి పోగేసి తృప్తి పడింది ‘ఈనాడు’.
2009లో ‘మహా’ పైత్యం
ఇక 2009 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ‘ఈనాడు’ రాసిన రాతలు, వేసిన వేషాలు, చేసిన విష ప్రచారాలను చూస్తే అంత గొప్ప గోబెల్స్ కూడా గింగిరాలు తిరగాల్సిందే. సంక్షేమానికి చిరునామాలా సాగిన వైఎస్ ఐదేళ్ల పాలనను చూసి ఎన్నికలకు ఎంతో ముందుగానే జావగారిపోయిన టీడీపీని రామోజీ నెత్తికెత్తుకున్న తీరు ఎంత చెప్పినా తరిగేది కాదు. ‘పాంచజన్యం’ పేరుతో ఏకంగా రోజుకు ఎనిమిది పేజీల చొప్పున నెలన్నరకు పైగా వైఎస్‌పై అక్షరాలా విషం చిమ్మింది ‘ఈనాడు’. ఒకే ఒక్కడిలా నిలిచిన ఆయనను ఒంటరిగా ఎదుర్కోలేక టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలతో కలిసి టీడీపీ ఏర్పాటు చేసిన మహా కూటమి మహాద్భుతమే చేయబోతోందంటూ మిడిమిడి రాతలు రాసింది. నిజానికి నిత్య కుమ్ములాటలతో, రోజుకో రకం రగడతో అప్పట్లో ఆ కలహాల కూటమి ప్రజలకు నిత్యం వినోదం పంచిన తీరు అందరి మనసుల్లోనూ ఇంకా తాజాగానే ఉంది. అసలు ఆ పార్టీల సారథులు కేసీఆర్, బీవీ రాఘవులు, కె.నారాయణలతో సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికే బాబుకు తల ప్రాణం తోకకు వచ్చింది.
పెపైచ్చు టీఆర్‌ఎస్‌కు కేటాయించిన పలు స్థానాల్లో టీడీపీ నేతలకు బీ ఫారాలిచ్చి మరీ బాబు బరిలో దింపారు. దాంతో రెండు పార్టీల నేతలూ నిత్యం నోటికొచ్చినట్టల్లా తిట్టిపోసుకుంటూనే గడిపారు. అయినా సరే, ‘ఈనాడు’ కంటికి వూత్రం అదంతా ‘ఎలాంటి పొరపొచ్చాలు, వివాదాలు లేని మైత్రి’గానే కన్పించింది. ఆ మాయా కూటమి బ్రహ్మాండం బద్దలు కొట్టబోతోందంటూ రెచ్చిపోయింది. తొలి విడత పోలింగ్‌కు ముందు ‘మహా స్వీప్’ అంటూ పతాక కథనాన్ని వండి వార్చింది. తొలి విడత పోలింగ్ జరిగిన మర్నాడేమో ‘మహా తడాఖా’ అంటూ జోస్యుని అవతారమెత్తింది. తెలంగాణ, ఉత్తరాంధ్రల్లో జరిగిన ఆ పోలింగ్‌లో ప్రజలంతా మహా కూటమికే గుండుగుత్తగా గుద్దేశారంటూ కౌంటింగ్ వగైరాలతో పని లేకుండానే తానే ప్రజా తీర్పును ప్రకటించేసింది! పైగా... తొలి విడత దెబ్బకు, మరో వారం తర్వాత జరగాల్సిన మలి విడతలోనూ కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేనంటూ తన దింపుడుకల్లం ఆశలనే విశ్లేషణలుగా అచ్చొత్తి తృప్తి పడింది. తీరా ఫలితాలొచ్చాక చూస్తే షరామామూలుగా టీడీపీ బొక్క బోర్లా పడింది. తాను మునగడమే గాక తనతో జట్టు కట్టిన పాపానికి టీఆర్‌ఎస్‌నూ, లెఫ్ట్ పార్టీలనూ ముంచేసింది. రాష్ట్ర ప్రజలు వైఎస్‌కే మరోసారి పట్టం కట్టారు. తద్వారా రామోజీకి పలుగు రాళ్లతో నలుగు పెట్టారు.
అచ్చొత్తిన అసత్యాలు
2004 మేలో, అప్పటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక వుుందే ‘చంద్రహాసం’ పేరుతో ‘ఈనాడు’ ప్రచురించిన పత్రిక ఇది. టీడీపీ గెలిచేసిందంటూ ‘కథనాలు’, విశ్లేషణలతో ఏకంగా 8 పేజీలను పక్కాగా వండి వార్చేశారు! వైఎస్ వెల్లువతో టీడీపీ కొట్టుకుపోవడంతో ‘చంద్రహాసం’ వెలుగు చూడలేదు. దాని ప్రతిని 2009 ఏప్రిల్ 21న మీడియూ వుుందు బయుట పెడుతున్న అప్పటి ఆర్థిక వుంత్రి కె.రోశయ్యును కింది క్లిప్పింగ్‌లో చూడవచ్చు.
2009లో ఇలా..
వైఎస్ లెక్క తప్పుతోందంటూ 2009 ఎన్నికల వేళ పోలింగ్‌కు వుుందు ‘ఈనాడు’ వండిన వంటకమిది. తెలంగాణలో వుహా కూటమి, కోస్తాలో ప్రజారాజ్యం పార్టీ వైఎస్‌ను దెబ్బ తీయునున్నాయుని, రాయులసీవులోనే ఆయునకు ఎదురుగాలి వీస్తోందని రాసుకుని తృప్తి పడింది!
2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్, వావుపక్షాల కలరుుకతో పుట్టిన వుహా కూటమి భారీ విజయుం సాధించడం ఖాయువుంటూ ‘వుహా స్వీప్’ శీర్షికన తొలి విడతకు వుుందు ‘ఈనాడు’ వండిన కథనం, కూటమి దున్నేసిందంటూ పోలింగ్ వుర్నాడు ‘వుహా తడాఖా’ శీర్షికన అది చెప్పిన చిలక జోస్యం తాలూకు క్లిప్పింగులివి.