చెత్త కాగితాల గుట్ట అబద్ధాల పుట్ట | NT Rama rao was given to interview on Eenadu of Ramoji rao | Sakshi
Sakshi News home page

చెత్త కాగితాల గుట్ట అబద్ధాల పుట్ట

Published Fri, Apr 18 2014 1:28 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

చెత్త కాగితాల గుట్ట అబద్ధాల పుట్ట - Sakshi

చెత్త కాగితాల గుట్ట అబద్ధాల పుట్ట

ఈనాడుపై ఎన్టీఆర్ వ్యాఖ్యలు
గోబెల్స్‌నే తలదన్నిన రామోజీ
*   దుర్మదాంధుడు, స్వార్థపరుడు
*    నాపై కర్రపెత్తనం చేయజూశాడు
*    అసత్యాన్ని అందలమెక్కించడమే రామోజీరావు ఏకైక లక్ష్యం
*   తిమ్మిని బమ్మి చేయడమే నైజం
*    చరిత్ర పెంటకుప్పల్లోనే మిగులుతాడు
*   జనం నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు
*  పత్రిక చేతిలో ఉందని చెత్త రాస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
* ‘బాబు వెన్నుపోటు’ అనంతరం ఓ ఇంటర్వ్యూలో అన్నగారు
 
 తాత్కాలికంగా చరిత్రను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నామని, కాలానికి కళ్లెం వేశామని భావించే అటువంటి దుర్మదాంధులు, స్వార్థపరులు చివరికి చరిత్ర విసిరేసిన పెంటకుప్పల్లో మాత్రమే ఉండిపోతారు.  ‘ఈనాడు’ అధిపతి రామోజీరావుపై దివంగత ఎన్టీఆర్ అన్న మాటలివి. ఎన్టీఆర్ తన చెప్పుచేతుల్లో ఉండటం లేదన్న రామోజీ అక్కసుపై, తనను గద్దె దించి, చెప్పుచేతుల్లో నడుచుకునే చంద్రబాబును గద్దెనెక్కించడానికి రామోజీ చేసిన కుట్రలపై ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ నోరు విప్పారు. 1995 ఆగస్టు 16 నుంచి జరిగిన ‘బాబు వెన్నుపోటు’ ఉదంతంపై ఎన్టీఆర్ తన మరణానికి కొద్ది రోజుల ముందు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను ‘‘తెలుగు ప్రజలకు ఎన్‌టిఆర్ వీలునామా’’ పేరుతో నవయుగ బుక్ హౌస్ పుస్తకంగా ప్రచురించింది. రామోజీరావు ఎలాంటి వాడో చెప్పే అందులోని కొన్ని విశేషాలు స్వయంగా ఎన్టీఆర్ మాటల్లోనే...  
 
 ‘‘నాపై కుట్ర పన్నడానికి ఉన్నదొక్కటే కారణం. చంద్రబాబులోని కరుడుగట్టిన స్వార్థం. వారి అవినీతికి నేను అడ్డుతగులుతున్నాననే వెన్నుపోటు పొడిచారు. తప్పుడు పద్ధతుల ద్వారా లక్షలకు లక్షలు సొమ్ము చేసుకునే వారి దుర్విధానాలను మేం సమర్థించలేకపోయూం. అడ్డు చెప్పాం. అటువంటి అవినీతి చర్యలను అంగీకరించబోమని స్పష్టం చేశాం. (కొంతసేపు మౌనం). అక్రమ విధానాల ద్వారా అమాయకులను, స్వార్థపరులను ఆకట్టుకోవడమెలాగో బాబుకు బాగా తెలుసు. బాబు అవినీతి ఇనుపతెర వెనక సాగిందేమీ కాదు. కనుక మా పార్టీలో చాలామందికి ఆ విషయూలు తెలుసునని నేను అనుకుంటాను. సకాలంలో సరైన చర్యలు తీసుకోలేకపోవడంలో కొన్ని పత్రికల బాధ్యతారహితమైన ప్రమేయం కూడా ఉందని వెల్లడించడానికి నేను విచారిస్తున్నా. ప్రత్యేకించి కొందరు పెద్దలు వారికి తొత్తులుగా వ్యవహరించారు. నేను ఒక పత్రికాధిపతి గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. ఆ పత్రిక పేరు, దాని అధిపతి పేరు ఉచ్చరించదలచుకోలేదు.
 
 తెలుగునాట తెలివి ఉన్న ప్రతి పాఠకునికీ ఆ విషయూలు తెలుసు. తిమ్మిని బమ్మి చేశారు. సత్యాలకు స్వస్తి చెప్పారు. వాస్తవాలకు వికృత వ్యాఖ్యలు కల్పించి ప్రచారం చేయడం ద్వారా గోబెల్స్ గుండెల్లో గుబులెక్కించారు. ఆయన కంటే కూడా ఆ విద్యల్లో ఆ పత్రిక వారు మించిపోయూరు. (కొంచెం బిగ్గరగానే నవ్వి) అవును బ్రదర్.. చరిత్ర పునరావృతం కాకూడదని మనమనుకుంటాం. కానీ ఇటువంటి పత్రికాధిపతులు గోబెల్స్ వంటి, లేదా అటువంటి వారిని మించిన చారిత్రక పాత్ర నిర్వహించడానికి అప్పుడప్పుడు పుడుతుంటారు.
 
 తాత్కాలికంగా చరిత్ర గమనాన్ని కొంత, చాలా కొద్దిమేరకు దారి తప్పించగలుగుతారు. అరుుతే చరిత్ర గమనం గతి తప్పిపోదు. ప్రజలు మళ్లీ తమ మానవ సమాజ చ రిత్ర రథ గమనాన్ని సవ్యమైన మార్గంలోకి, దివ్యపదంలోకి మళ్ళ్లిస్తారు. తాత్కాలికంగా చరిత్రను తమ గుప్పిట్లోకి తెచ్చుకొన్నామని, కాలానికి కళ్లెం వేశామని భావించి అటువంటి దుర్గర్వపుర, దుర్మదాంధులు, స్వార్థపరులు చివరికి చరిత్ర విసిరేసిన పెంటకుప్పల్లో మాత్రమే ఉండిపోతారు.
 
 నా రాజకీయ ప్రవేశంతో రామోజీకి సంబంధమే లేదు
 నేను రాజకీయూల్లోకి ప్రవేశించే నాటికి నాకు ఆయన (పత్రికాధిపతి)తో పరిచయం కూడా లేదు. చలనచిత్ర జీవితంలో నేను వివిధ పాత్రలను పోషిస్తూ సమాజం నుంచి, పేదల నుంచి పొందిన స్పందన ఫలితంగానే రాజకీయూల్లోకి వచ్చాను. ఈ పత్రికాధిపతికి నా రాజకీయ రంగ ప్రవేశంతో ఇసుమంత సంబంధం కూడా లేదు. ప్రత్యక్షంగా నేను రాజకీయూల్లోకి ప్రవేశించే నాటికి కొన్ని దశాబ్దాల క్రితమే నన్ను రాజకీయూల్లోకి రమ్మని పూజ్యులు నీలం సంజీవరెడ్డి గారు ఆహ్వానించారు. కాసు బ్రహ్మానందరెడ్డిగారు ‘ఎంపీ టికెటిస్తాను ఎన్టీఆర్, మా పార్టీలో చేరు’ అని కోరారు. అప్పుడు వారి కోరికలను నేను మన్నించలేకపోయూను. ఈ పత్రికాధిపతిని నేను తెలుగుదేశం పార్టీని స్థాపించేక కొందరు మిత్రులు పరిచయం చేశారు.

అప్పుడు ఉపేంద్ర గారు, భాస్కరరావు గారు కూడా ఉన్నారనుకుంటాను. ఏ మాటకామాట చెప్పుకోవాలి. మొదటిసారి మా తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో విజయం సాధించి మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పెద్దమనిషిని (పత్రికాధిపతిని) రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి మండలి అధ్యక్షులుగా ఉండమని కోరాను. తరువాత ఎంపీ సీటు కూడా ఆఫర్ చేశాను. మీరు ఆలోచించండి. నేను చెప్పేది విని - నా మాటల్లో నిజం వుందో లేదో తేల్చి చెప్పండి. ఆ పత్రికాధిపతి నేను ఆఫర్ చేసిన పదవుల్ని నిరాకరించాడు గానీ, ఆయన నా మీదే పెత్తనం చలారుుంచాలనుకున్నాడు. నన్ను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకొన్నాడు. ఆయనకు తాబేదారుగా ఉండటానికి, ఆయనకు మద్దెల కొట్టడానికి, భజన చేయడానికి నేను అంగీకరించలేదు. నేను తెలుగు వాణ్ణి. స్వాభిమానపరుడ్ని. ఆత్మగౌరవాన్ని అవసరం కోసం అంగడి సరుకుగా మార్చుకోవడానికి ససేమిరా ఇష్టపడని వాణ్ణి. వ్యక్తిత్వ పరిరక్షణకు నా ప్రాణాలనైనా తృణప్రాయంగా భావించేవాణ్ణి.
 
 ఎన్టీఆర్ చండశాసనుడని ఆయన తెలుసుకున్నాడు. తమ పత్రికలో మాకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించసాగారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నీతిమాలిన నికృష్టపు రాతలతో వ్యక్తుల జీవితాలపై కూడా బురద జల్లడానికి సమకట్టారు. ఆ రాతల పట్ల మేము అభ్యంతరం చెప్పాం. ఆరుునా ఆపలేదు. రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛను ప్రసాదించింది దుర్వినియోగం చేయడానికేనని వారు భావించినప్పుడు, అందుకు అనుగుణంగానే వ్యవహరించడానికి నిర్ణరుుంచుకున్నప్పుడు ప్రజలే గుణపాఠం చెబుతారని వారికి చెప్పాం. మీరు రాసేది రాయండి, నేను చేసేది చేస్తానని చెప్పాను. ఆనాటి నుంచి ఆయన మా మీద పగ పెంచుకున్నాడు. మా మీద, ఆమె (లక్ష్మీపార్వతి) మీద అవాకులు చెవాకులు రారుుస్తున్నాడు.   తన పత్రికని అబద్ధాల పుట్టగా, చెత్త కాగితాల బుట్టగా మార్చేస్తున్నాడు.
 
 పిచ్చి కార్టూన్లు, పిచ్చి రాతలు
 అవాకులు చెవాకులు వదిలిపెట్టి చెప్పమనండి ఆ పెద్దమనిషిని - నేను అధికారాన్ని దుర్వినియోగం చేశానా? అవినీతికి పాల్పడ్డానా? అక్రమార్జనలకు పూనుకున్నానా? ప్రజలే నా దేవుళ్లని, సమాజమే దేవాలయం అని నమ్మి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటే నాకు ఎందుకు ద్రోహం చేస్తున్నాడో ఆ పెద్దమనిషిని (పత్రికాధిపతి) చెప్పమనండి. ప్రజలు వారిని నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు.  పత్రికలున్నది ప్రజల బాగు కోసం. పత్రికా స్వేచ్ఛ వుండేది ఆ కర్తవ్యాల నిర్వహణ కోసం. అంతేగానీ నా చేతిలో పత్రిక వుందికదా అని నానా రాతలు రాస్తూ బాధ్యతలు విస్మరిస్తే ప్రజలు తగిన విధంగా బుద్ధిచెబుతారు. స్త్రీలను గౌరవించడం తెలియని అనాగరికపు జులారుుతనం తప్ప వారి ఆరోపణల్లో, రాతల్లో,  కార్టూనుల్లో మరేమిటి వ్యక్తం అవుతోంది బ్రదర్? పిచ్చి కార్టూన్లు.... పిచ్చి రాతలు.
 
 అల్లుడే నా కాళ్లు లాగేశాడు..  వీపులో విచ్చుకత్తులు దించాడు
 మీరే చెప్పండి. విశాఖపట్నం నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వస్తున్నప్పుడు నా కాళ్ల వద్ద పెట్టె వున్న కారణంగా నేను కాళ్లు ముడుచుకు కూర్చుంటే నా కాళ్లు నొప్పి పెడతాయని, నా కాళ్ల ముందున్న పెట్టెను అక్కడి నుంచి తీసిన ఆయన (బాబు)... హైదరాబాద్ చేరగానే నా వీపులో విచ్చు కత్తులు దించుతాడని ఎట్లా ఊహించమంటారు? విమాన ప్రయూణంలో నా శ్రేయోభిలాషిగా వ్యవహరించిన వ్యక్తి, హైదరాబాద్‌లో విమానం దిగగానే విషప్పుచ్చుగా మారతాడని ఎలా అనుకోగలను? 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయూడాయన.
 
 అరుునా  మేము అధికారంలోకి వచ్చినప్పుడు మా పంచన చేరారు. అల్లుడనే భావంతోనే మేము ఆయనకు పార్టీలో అవకాశం కల్పించలేదు. నా కూతురు అటువంటి విషయూల్లో ఎప్పుడూ జోక్యం కలిగించుకోలేదు. పార్టీలోని ముఖ్యులంతా ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని నాకు సలహా ఇచ్చారు కూడా. అరుునా వారి మాటను కాదని పార్టీలోకి ప్రవేశం కల్పించాను. ఒక స్వార్థపరుడికి ఎలాంటి మనః ప్రవత్తి వుంటుందో తెలుసుకోలేకపోయూను’’
 
 అధికారం కోసం కాంగ్రెస్‌తోనూ బాబు లాలూచీ
 ఒకప్పుడు నేను మా బాలయ్య (బాలకృష్ణ)ను నా రాజకీయ వారసుడిగా తీసుకురావాలని భావిస్తున్నట్టు ప్రకటన చేశానని కొన్ని పత్రికలు ప్రచురించారుు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వారసత్య రాజకీయూలకు అవకాశమెక్కడ? ఒకే కుటుంబంలోని వారే అరుునా వారి వారి యోగ్యతాయోగ్యతలపై ఆధారపడి ఉంటుంది. కానీ వారు తమ స్వార్థపూరిత, కుట్ర రాజకీయూల కోసం నా బిడ్డలను కూడా రెచ్చగొట్టారు. నా కుటుంబసభ్యులు చాలామందితో మాపై వ్యతిరేకత కల్పించడానికి, పెంచడానికి ప్రయత్నించారు. నాపై వారు కుట్ర పన్నడానికి ఇవే ప్రధానమైన కారణాలుగా నేను భావిస్తున్నాను. చెప్పానుగా, బాబు బ్రతుక నేర్చినవాడని, స్వార్థపరుడని, ఆయన 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో అధికార పెత్తనం చేపట్టడానికి కాంగ్రెస్‌కు చెందిన కొందరితో కూడా సంప్రదింపులు జరిపాడ ని మాకు తెలిసింది. ఇది ముమ్మాటికీ నిజం. కొందరు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఆ ఎన్నికలకు ముందే బెంగుళూరులో సమావేశమైనట్టు మాకు తరవాత సమాచారం అందింది.
 
 ‘‘ఆ పెద్దమనిషికి రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి మండలి అధ్యక్ష పదవి, ఎంపీ సీటు ఆఫర్ చేశాను. అవి వద్దన్నాడు. నామీదే పెత్తనం చలారుుంచాలనుకున్నాడు. నన్ను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకొన్నాడు. ఎన్టీఆర్ చండశాసనుడని తెలుసుకుని నాపై పగ పెంచుకున్నాడు. తన పత్రికలో నాపై వ్యతిరేక వార్తలు ప్రచురించసాగాడు. నీతిమాలిన నికృష్టపు రాతలతో బురదజల్లాడు’’
 
 ‘‘ఒక పత్రికాధిపతి గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. ఆ పత్రిక పేరు, దాని అధిపతి పేరు ఉచ్చరించదలచుకోలేదు. ఆ పేర్లు తెలుగునాట తెలివి ఉన్న ప్రతి పాఠకునికీ తెలుసు. తిమ్మిని బమ్మి చేశారు. సత్యాలకు స్వస్తి చెప్పారు. వాస్తవాలకు వికృత వ్యాఖ్యలు కల్పించి ప్రచారం చేయడం ద్వారా గోబెల్స్ గుండెల్లో గుబులెక్కించారు. ఆ విద్యల్లో ఆయన కంటే కూడా మించిపోయూరు’’
 
 ‘‘ప్రజలు వారిని నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదు. వారైనా, రేపు మీరైనా సరే... సత్యాన్ని విస్మరించి, అసత్యాన్ని అందలమెక్కించాలని ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. పత్రికలున్నది ప్రజల బాగు కోసం. పత్రికా స్వేచ్ఛ ఉండేది ఆ కర్తవ్యాల నిర్వహణ కోసం. అంతేగానీ చేతిలో పత్రిక ఉంది కదా అని నానా రాతలు రాస్తూ బాధ్యతలు విస్మరిస్తే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారు. స్త్రీలను గౌరవించడం తెలియని అనాగరికపు జులాయితనం తప్ప వారి ఆరోపణల్లో, రాతల్లో, కార్టూనుల్లో మరేమిటి వ్యక్తమవుతోంది బ్రదర్? పిచ్చి కార్టూన్లు. పిచ్చి రాతలు’’
 
 ‘‘చెప్పానుగా, బాబు బ్రతుక నేర్చినవాడు. స్వార్థపరుడు. 1994 అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో అధికార పెత్తనం చేపట్టడానికి కాంగ్రెస్‌కు చెందిన కొందరితో కూడా సంప్రదింపులు జరిపాడు. ఇది ముమ్మాటికీ నిజం. కొందరు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆ ఎన్నికలకు ముందే బెంగుళూరులో ఆయన సమావేశవుయ్యూడు’’

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement