ఇందూరు, న్యూస్‌లైన్ : జడ్‌పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మే7న ప్రకటించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు జిల్లాలోని రాజకీయ పక్షాలకు, అధికారులకు ఊరట నిచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 30న జరుగ నుండగా, ఎంపీ,ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావహులు ఉపశమనం పొం దారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల ఫలి తా లు తమ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని ఇప్పటి వరకు వారు ఆందోళ న చెందారు.
ప్రస్తుతం జిల్లాలో మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మున్సిపాలిటీల్లోనైతే ప్రధాన పార్టీలు దూకుడును పెంచాయి. డివిజన్లు, వా ర్డు స్థానాలకు పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను గెలిపించాలని పార్టీల జిల్లా స్థాయి నేతలు గల్లీలను చుట్టుముడుతున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే రేపటి సార్వత్రిక ఎన్నికల్లో తమకు లాభించవచ్చేనే ఆశాభావంతో వారు ఉంటున్నారు. ఇ ది లా ఉండగా పార్టీల గుర్తుపై మున్సిపల్,పరిషత్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రధానంగా అభ్యర్థుల వ్యక్తిత్వ ం, గుణగణాలను పరిగణనలోకి తీసుకుని ఓట్లు పడతాయనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది.
తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయి. ఏప్రిల్ 6న మొద టి విడత, ఏప్రిల్ 11న రెండో విడత ఎన్నికలు నిర్వహించగా.. మే 7న ఫలితాలను ప్రకటిస్తారు. రెండు విడత ల్లో ఎన్నికల నిర్వహణ అధికారులకు సైతం సిబ్బంది సమస్యను తీర్చనుం ది. ఎన్నికలు వరుసగా రావడంతో ఎన్నికల విధులకు సిబ్బందిని కేటాయించడం ఎలాగని అధికారులు అంతర్మథనం చెందారు. ప్రస్తుతం జిల్లాలోని 36 మండలాలను విభజించి విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు.
రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు
Published Fri, Mar 28 2014 2:46 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement