అమరావతి, న్యూస్‌లైన్ : మండలంలోని పెదమద్దూరు రైతు సహకార సొసైటీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకుడు ప్రత్తిపాటి శ్రీనివాసరావు, అతని బంధువులపై ఆదివారం రాత్రి దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకూరపాడు మండలం కంభంపాడు నుంచి వచ్చి పెదమద్దూరులో నివాసం ఉంటున్న రాయపాటి శంకర్ మద్యం తాగి తన ఇష్టం వచ్చినట్లు పరుష పదజాలంతో తిడుతున్నాడు. ఈక్రమంలో ఎందుకు తిడుతున్నావని అడిగితే శంకర్, అతని ఇద్దరు కుమారులు.. పెదమద్దూరు సొసైటీ చైర్మన్ ప్రత్తిపాటి శ్రీనివాసరావు, అతని బంధువులు పొదిలె సారంగయ్య, జాస్టి శివరాంప్రసాద్, జాస్టినాగయ్యలపై కొడవలితో దాడి చేసి గాయపరిచారు. దీంతో శ్రీనివాసరావు, సారంగయ్యలకు తీవ్రగాయాలవడంతో వారిని చికిత్స కోసం గుంటూరు తరలించగా, మిగిలిన ఇద్దరిని అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై అమరావతి ఎస్‌ఐ సాంబశివరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాటి శ్రీనివాసరావు వర్గీయులు వైఎస్సార్ సీపీ గెలుపు కోసం పనిచేసినందువల్లే వారిపై టీడీపీకి చెందిన రాయపాటి శంకర్, అతని కొడుకులు దాడి చేశారని కొంతమంది గ్రామస్తులు చెప్పడం గమనార్హం!
వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి
Published Sun, May 11 2014 11:44 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement