శివ్వంపేట, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మంగళవా రం అర్ధరాత్రి దాడికి పాల్పడడంతో మండల పరిధిలోని గోమారం ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే డబ్బులు, మద్యం పంచుతున్నారన్న అనుమానంతో టీఆర్‌ఎస్ నాయకులు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి కాంగ్రె స్ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ మద్దతుదారు లు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం రాంరెడ్డి, లక్ష్మణ్‌గౌడ్‌లు తీవ్రంగా గాయపడగా.. గడ్డం నరేందర్, ఎండీ రషీద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్ నా యకుల ఇళ్లపైకి రాళ్లు విసరడంతో గ్రా మంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స మాచారం అందుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ సంజయ్‌కుమార్, ఎస్‌ఐలు రాజేష్‌నాయక్, నాగేశ్వర్‌రావు సం ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల ను చెదరగొట్టారు. గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను చికిత్స నిమిత్తం సూరారంలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
సర్పంచ్‌తో సహ 11 మందిపై కేసు నమోదు
కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్‌నాయక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మణ్‌గౌడ్, గడ్డం రాంరెడ్డి, గడ్డం నరేందర్‌రెడ్డి, ఎండీ రషీద్‌లపై దాడికి పాల్పడిన సర్పంచ్ చంద్రాగౌడ్‌తో పాటు పెద్ద పట్లోరి బిశ్వంత్‌రెడ్డి, పెద్ద పట్లోరి శ్రీధర్‌రెడ్డి, పెద్ద పట్లోరి వెంకట్‌రెడ్డి, పెద్ద పట్లోరి లచ్చిరెడ్డి, దొంతిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, దొంతిరెడ్డి నరసింహారెడ్డి, దొంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎండీ దస్తాగిరి, తుడుం కృష్ణ, సత్యనారాయణరెడ్డి, నందనం శంకర్‌లపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వీరిలో సర్పంచ్ చంద్రాగౌడ్, బిశ్వంత్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలను అరెస్టు చేసి నర్సాపూర్ కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
చెన్నాపూర్‌లో నలుగురిపై కేసు నమోదు
విధులు నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుడు సత్తయ్యపై దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్‌నాయక్ తెలిపారు. మండలంలోని పెద్ద గొట్టిముక్కుల పంచాయతీ చెన్నాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద వంద మీటర్ల పరిధిలో ఉన్న టీఆర్‌ఎస్ పోస్టర్లను తొలగిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుడు సత్తయ్యపై గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు బొల్ల భిక్షపతి, ఇటబోయిన మల్లేష్, బాయిని మహేష్, మన్నె గోపాల్‌లు దాడి చేయగా వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.
గోమారంలో ఉద్రిక్తత
Published Wed, Apr 30 2014 11:44 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement