కలెక్టరేట్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బరిలో నిలిచే జిల్లా, మండల పరిషత్ అభ్యర్థుల జాబితా సోమవారం ఖరారు కానుంది. పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటించనున్నారు. కాగా, జెడ్పీటీసీలకు దాఖలైన నామినేషన్లలో 24 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. తిరస్కరణకు గురైనా అభ్యర్థులు అప్పీలు చేసుకున్నారు. అప్పీలును ఆదివారం పరిశీలించిన కలెక్టర్ అహ్మద్ బాబు తిరస్కరించిన 24 నామినేషన్లలో 14 ఆమోదించారు. మిగతా పది నామినేషన్లు తిరస్కరించారు.
తిరస్కరణకు గురైన వారి లో అందల్‌వార్ కృష్ణస్వామి (నార్నూర్), చిట్టి స్వప్న (సారంగాపూర్), జి. సుమలత (సారంగాపూర్), కాసు రాధిక (భైంసా), శ్రీమల్లే రాజయ్య (ఉట్నూర్), తోటి గంగమ్మ (ఉట్నూర్), తోటి ఆశన్న (ఉట్నూర్), వందనబాయి (ఇంద్రవెల్లి), మోత్కూరి వెంకటస్వామి (లక్సెట్టిపేట), మెస్రం భాగ్యలక్ష్మీ (జైనథ్) ఉన్నారు.
బీ-ఫారం సమయం 3 గంటల వరకు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు బీ-ఫారాలను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వరకు సమర్పించాలి. ఎంపీటీసీ అభ్యర్థి అయితే మండల కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి, జెడ్పీటీసీ అభ్యర్థి అయితే జిల్లా పరిషత్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. రాజకీయ ప్రజాప్రతినిధులు తమ అభ్యర్థులకు జారీ చేసే బీ-ఫారాలను సమయం దృష్టిలో ఉంచుకొని జారీ చేయాలని జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జనార్దన్ నివాస్‌లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల అనంతరం బీ-ఫారాలను స్వీకరించమని తెలిపారు. అనంతరం ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
నేడు ‘పరిషత్’ అభ్యర్థుల ఖరారు
Published Mon, Mar 24 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM
Advertisement
Advertisement