రేపు జిల్లాకు జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల నాలుగో తేదీన (ఆదివారం) ఎన్నికల ప్రచారం నిమిత్తం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి జగన్ మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో బయలుదేరి జిల్లాకు జగన్ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కనిగిరి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
అనంతరం అక్కడి నుంచి 4.30 గంటలకు చీరాల చేరుకోనున్నారు. చీరాలలో జరిగే బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు. ఈ మేరకు జగన్ బహిరంగ సభలకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేపడుతున్నారు. రెండు నియోజకవర్గాల్లోను సభాస్థలానికి కొద్దిదూరంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. జగన్ సభకు భారీగా ప్రజలు తరలి రావాలని నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు.