మోడీబాబులూ జవాబివ్వండి! | why narendra modi give higher priority to andhrapradesh? | Sakshi
Sakshi News home page

మోడీబాబులూ జవాబివ్వండి!

Published Sun, May 4 2014 4:43 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

మోడీబాబులూ జవాబివ్వండి! - Sakshi

మోడీబాబులూ జవాబివ్వండి!

* కేజీ బేసిన్ గ్యాస్‌లో తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యమిస్తానని మోడీ ఎందుకు హామీ ఇవ్వరు?
 * రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తున్న బాబు.. ఆ విభజనకు కారణమైన బీజేపీతో ఎలా జట్టుకట్టారు?

ప్రొఫెసర్ కె.నాగేశ్వర్

తెలుగునాట చంద్రబాబు వెంటరాగా, పవన్ కల్యాణ్ పక్క వాయిద్యాలతో నరేంద్రమోడీ ప్రచార హడావుడి సాగించారు. ఎన్నికల వేళ సహజంగానే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కానీ తెలుగు గడ్డపైన మోడీ బాబు పవన త్రయం చేసిన ప్రసంగాలు అనేక ప్రశ్నలను లేవనెత్తారుు. ఈ ప్రశ్నలకు సవూధానం చెప్పాల్సిన బాధ్యత వీరిపై ఉంది.

1
2002లో గుజరాత్‌లో మత మారణహోమం జరిగినప్పుడు, మోడీ రాజధర్మాన్ని విస్మరించాడంటూ సాక్షాత్తూ వాజ్‌పేయే విమర్శించారు. ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మోస్తున్న తెలుగు దేశం పార్టీ వాజ్‌పేయి సర్కారుకు వుద్దతు ఉపసంహరించుకుందావున్నంత పని చేసింది. చివరకు నిరసనగా జీఎంసీ బాలయోగి వురణానంతరం స్పీకర్ పదవిని తీసుకునేందుకు నిరాకరించింది. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతునివ్వడం చారిత్రక తప్పిదం అంటూ ఆ తర్వాత చంద్రబాబు లెంపలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీని పొగిడే క్రవుంలో హాస్యాస్పదమైన వాదనలను వుుందు పెడుతున్నారు. మోడీ నిరాడంబరత్వం గురించి .మాట్లాడుతూ ఆయున తల్లి ఆటోలో వెళ్లి ఓటు వేసిందంటూ చంద్రబాబు తెగపొగిడేశారు. కానీ తల్లిని అది కూడా వయోవృద్ధురాలికి కనీసం టాక్సీ అరుునా ఏర్పాటు చేయులేని నరేంద్రమోడీ వైఖరిని ప్రశ్నించాల్సింది పోరుు ప్రశంసించడం విడ్డూరంగా ఉంది. మోడీ తల్లికి లిఫ్టు ఇచ్చేందుకు కారున్న వారు గుజరాత్ రాష్ట్రంలో ఒక్కరైనా లేరా? అబద్ధాలు చెప్పేందుకైనా హద్దులుండాలి.
 
 2
 సీవూంధ్ర తీరాన గ్యాస్ నిక్షేపాలున్నారుు. వీటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలే మార్చేయువచ్చు అంటూ మోడీ ఆశల పల్లకిలో సీవూంధ్ర ప్రజల్ని ఊరేగించారు. కానీ ఇది జరగాలంటే కొన్ని నిర్దిష్ట హామీలుండాలి. ఒకటి గ్యాస్ నిక్షేపాలు ఏ రాష్ట్రంలో ఉన్నా వాటిని కేటారుుంచే అధికారం కేంద్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తీరాన కృష్ణా గోదావరి బేసిన్‌లో పుష్కలంగా లభిస్తున్న సహజవాయుువు కేటారుుంపుల్లో తెలుగు రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని నరేంద్రమోడీ హామీ ఎందుకివ్వరు? చంద్రబాబు ఆ హామీని ఎందుకు రప్పించరు. రెండు.. ఒక రాష్ట్రంలో లభించే గ్యాసులో కేంద్రానికి వచ్చే రాయల్టీ గ్యాస్‌లో 50 శాతం సంబంధిత రాష్ట్రానికి వాటాగా ఇవ్వాలని గతంలో ఆర్థిక సంఘమే సిఫారసు చేసింది. ఇది గనుక ఆంధ్రప్రదేశ్‌కు లభిస్తే రెండు లక్షల కోట్ల రూపాయుల పెట్టుబడులు వస్తాయి. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఆర్థిక సంఘం చేసిన సిఫారసును అమలు చేస్తానని మోడీ ఎందుకు మాటివ్వరు? చంద్రబాబు ఎందుకు అడగరు? ప్రశ్నించడమే పవనిజం అనే పవన్ కల్యాణ్‌కు ఈ కీలక విషయాలు ఎందుకు పట్టవు? మూడు.. రిలయన్స్‌కు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ధరలను నిర్ణయించింది. ఫలితంగా అంబానీలకు నాలుగు లక్షల కోట్లు లాభం వచ్చింది. యూపీఏ దోపిడీపై ఎన్‌డీఏ నేతలు ఎందుకు పెదవి విప్పరు? రిలయన్స్ విషయానికి వచ్చే సరికి అందరిదీ మౌనమే.
 
 3
 సీమాంధ్ర అనాథ కాదు, ఆదుకుంటామంటూ మోడీ దీవెనలు. పదిహేనేళ్ల ప్యాకేజీ కావాలంటూ అందుకు మోడీ అంగీకరిస్తారంటూ చంద్రబాబు ఆశలు. అంతా బాగుంది. కానీ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు ఇలాంటి ప్యాకేజీ కోసం బీజేపీ, టీడీపీ ఎందుకు పట్టుబట్టలేదు? లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఎందుకు సవరణ సూచించలేదు? ఇది తప్పేనని ఆ పార్టీ నాయకుడు కె.హరిబాబే వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఆరాటపడుతున్న యూపీఏ చాలా సులభంగా ఇలాంటి డిమాండ్‌కు ఒప్పుకునేది. కానీ లోక్‌సభలో బీజేపీ అడగలేదు. అడగమని తమ మిత్రపక్షమైన టీడీపీ ఒత్తిడి తేలేదు. తెలుగుదేశమైనా అలాంటి సవరణను ప్రవేశపెట్టలేదు. ఐదేళ్ల ప్యాకేజీకే చట్టబద్ధతకు యత్నించని వారు ఇక పదిహేనేళ్ల ప్యాకేజీ తెస్తారంటే ఎలా నమ్మాలి? అయినా ఎవరన్నారు తెలుగు రాష్ట్రం అనాథ అని. తల్లిదండ్రులను చంపిన వారే అనాథ అయిన ఆ బిడ్డను అక్కున చేర్చుకుంటానన్నట్లుంది మోడీ వైఖరి. రాష్ట్ర విభజన తీరును చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ తీరున రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఢిల్లీ సింహాసనంపై తిరగబడిన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ కృపా కటాక్ష వీక్షణాల కోసం తాకట్టు పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. మోడీ ఆదుకుంటే తప్ప తెలుగు ప్రజలకు భవిష్యత్తే లేదు అన్న తీరున మాట్లాడటం తెలుగు వారిని అవమానించడమే.
 
 4
 సీమాంధ్రలో ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్‌లాగా అభివృద్ధి చేస్తామని మోడీ, బాబుల వాగ్దానాలు. కానీ తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో సీమాంధ్రలో ఎందుకని ఒక్క నగరాన్ని కూడా హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయలేదు? అప్పుడు టీడీపీ మద్దతుతోనే ఎన్డీఏ సర్కారు కేంద్రంలో కొలువు తీరింది. అప్పుడు సహకరించని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు సహకరిస్తుందంటే ఎలా నమ్మాలి?
 
 5
 స్వర్ణాంధ్ర కావాలంటే చంద్రబాబును ఎన్నుకోండంటూ మోడీ పిలుపునిచ్చారు. కానీ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పాలన మరణాంధ్రప్రదేశ్‌ను సృష్టించిందని బీజేపీ నాయకత్వం విరుచుకుపడింది. ఇందుకు బీజేపీ ఇప్పుడు క్షమాపణ చెప్తుందా? రాజకీయాల్లో తిట్టుకోవడం సహజమే కలవడమూ సహజమే అంటూ ప్రజలు కాలక్షేపం చేయాల్సిందేనా? అప్పటి కథ ఎందుకు? ఎన్నికల పొత్తులపై చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఉభయ పార్టీల నాయకులూ ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. బీజేపి నాయకుడు కిషన్‌రెడ్డిపై దేశం నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. చంద్రబాబును అంటరానివాడుగా రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలియనిది కాదు. ఇప్పుడు వేదికలపై నుంచి అగ్రనేతలు ప్రేమ పాటలు పాడుతుంటే క్షేత్రస్థాయిలో ఉభయ పార్టీల కార్యకర్తల మధ్య కెమిస్ట్రీ కుదిరేనా? బలవంతంగా పెద్దలు చేసిన పెళ్లి నిలబడేనా?
 
 6
 సీమాంధ్ర భవిష్యత్తుకు ఉన్న అవకాశాలను అనేక సభల్లో మోడీ ఏకరువు పెట్టారు. ఇది వాస్తవమే కానీ రాజకీయ సంకల్పం సంగతేమిటీ? ఉదాహారణకు సీమాంధ్రకు సుమారు వెయ్యి కిలో మీటర్ల తీరప్రాంతం ఉంది అంటూ మోడీ గుర్తు చేశారు. కానీ ఈ తీరం కొత్తగా వచ్చింది కాదు. ఈ తీరం అక్కడ బీజేపీ ఇక్కడ టీడీపీ సర్కారులు ఉన్న రోజుల్లో కూడా ఉన్నదే కానీ అప్పుడు అభివృద్ధి చేసింది ఏమిటో చెప్పాలి. మరోవైపు విశాఖ స్టీలు ప్లాంటుకు ఇనుప ఖనిజాన్ని యూపీఏ, ఎన్డీఏలు కేటాయించలేదు. హిందుస్తాన్ జింక్‌ను ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాలు అమ్మివేశాయి. ఇప్పుడు విశాఖను అభివృద్ధి కేంద్రంగా చేస్తామంటున్నారు. చివరికి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఆనాడు ఎన్డీఏ ఈనాడు యూపీఏ పట్టించుకోలేదు. విజయవాడ నగర కార్పొరేషన్‌కు జీతాలిచ్చే వనరులు కూడా లేని పరిస్థితి. భవ్యమైన రాజధానికి భరోసా ఇదేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement