కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీడుకు ఎదురులేకుండాపోయింది. జిల్లాలోని రెండు లోక్సభ సీట్లను, 14 అసెంబ్లీ స్థానాలకు గాను 11 సీట్లను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎస్పీవై రెడ్డి నంద్యాల నుంచి, బుట్టా రేణుక కర్నూలు నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆళ్లగడ్డ నుంచి వైఎస్ఆర్ సీపీ దివంగత నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి విజయం సాధించారు. ఎన్నికలకు ముందు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి (శ్రీశైలం), ఐసయ్య (నందికొట్కూరు), ఎస్ వీ మోహన్ రెడ్డి (కర్నూలు), గౌరు చరితా రెడ్డి (పాణ్యం), రాజేంద్రనాథ్ (డోన్), మణిగాంధీ (కోడుమూరు), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), సాయి ప్రసాద్ రెడ్డి (ఆదోని), జయరామ్ (ఆలూరు) నుంచి గెలుపొందారు. కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ ఓటమి చవిచూశారు.
కర్నూలులో వైఎస్ఆర్ సీపీ స్పీడు
Published Fri, May 16 2014 6:44 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement