మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా పోటీ ఇచ్చినా ఫ్యాన్ గాలి బలంగా వీచింది.
కర్నూలు: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా పోటీ ఇచ్చినా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, గూడూరు, ఆదోని, ఆత్మకూరు పురపాలక సంఘాలను సొంతం చేసుకుంది. ఇతర మున్సిపాల్టీల్లోనూ వైఎస్ఆర్ సీపీ గట్టి పోటీనిచ్చింది. కాగా నంద్యాల, ఎమ్మిగనూర్, డోన్ మున్సిపాల్టీల్లో తెలుగుదేశం విజయం సాధించింది.