కళ్ల కింది వలయాలకు...
బ్యూటిప్స్
టొమాటో రసంలో కొద్దిగా నిమ్మరసం, కాసింత పుదీనారసం వేసి బాగా కలపాలి. దీన్ని కళ్ల చుట్టూ పూసి, ఆరిన తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు పోతాయి. కంప్యూటర్ల ముందు ఎక్కువ పనిచేసేవాళ్లు ఈ చిట్కాను పాటిస్తూ ఉంటే నల్లని వలయాలు ఏర్పడకుండా ఉంటాయి. రాత్రి పడుకోబేయే ముందు బాదం నూనెతో కళ్ల కింది వలయాల మీద మృదువుగా రుద్దుతూ కాసేపు మర్దనా చేయాలి. రాత్రంతా అలా వదిలేసి, ఉదయాన్నే చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారం పది రోజుల పాటు రోజూ ఇలా చేస్తే నలుపు తగ్గుతుంది.
బంగాళాదుంపను సన్నగా తురిమి, ఓ బట్టలో వేసి గట్టిగా పిండి రసం తీయాలి. దీనిలో కొద్దిగా పాల క్రీమ్‌ను కలిపి కళ్ల కింద పూసి, ఆరిన తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. కీరాదోస రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లతో కలిపి కళ్లకింద పూయాలి. రోజుకు రెండుసార్లు చొప్పున వారం రోజుల పాటు ఇలా చేస్తే నల్లని వలయాలు మాయమైపోతాయి. చెంచాడు ఆరెంజ్ జ్యూస్‌లో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత కళ్ల కింద రాసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఉదయం లే వగానే ఇలా చేస్తే... డార్క్ సర్కిల్స్ పోతాయి.